తెల్లబోయిన మానవత్వం

(అంశం:”అగమ్యగోచరం”)  

తెల్లబోయిన మానవత్వం

రచన ::వనపర్తి గంగాధర్ 

అల్లకల్లోలమైన ఆప్గానిస్థాన్
అంధకారమైన అమాయక జీవితాలు
రాకాసి మూకల కబంధ హస్తాల్లో
నలిగి నశించి పోతున్న ప్రాణాలు
వారి జీవితం మారెను ఆగమ్యగోచరమై

రాచరిక రాబందులు తుపాకీ గొట్టానికి
తూట్లు పడి ఛిద్రమౌతున్న గుండెలెన్నో
తాలిబన్ రక్కసుల నీచ కృత్యాలకు
బలి అవుతూ అశువులుబాస్తూ
ఎందరి కలలో కల్లలై రక్తాశ్రువులై గోశిస్తున్న
వారి బతుకు బండి సాగని ఆగమ్యగోచరం

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
చెట్టుకొకరు, పుట్టకొకరు పరుగో పరుగు
కళ్ళముందే మృత్యువు తూటా యై
గర్జిస్తున్న వైనం ఎంత ఘోరం
మనిషి చేస్తున్నానని తెలిస్తే ఎంత హృదయ ఘోష

ఈ మారణ హోమాన్ని ప్రపంచ దేశాధినేతలు
శాంతి సంఘాలు,మానవ హక్కుల సంఘాలు
ప్రేక్షకులై వీక్షిస్తున్నాయే తప్ప
ఆ మారణ మృత్యు విలయాన్ని ఆపేవారేరి
ఈ ఆగమ్యగోచర పరిస్థితిని చూసి
మానవత్వం తెల్లబోయి చూస్తుంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!