అసలు సిసలైన దీపావళి

అసలు సిసలైన దీపావళి

రచన: ఎన్.ధన లక్ష్మి

” అమ్మ!ఏమి చేస్తున్నావు ఇక్కడ! నీ కోసం ఇల్లంతా  వెతికాను తెలుసా…”

“రా రా బుజ్జి కన్న….కవర్స్ కోసం వెతుకుతూ ఈ స్టోర్ రూంలో  ఉన్న రా ..ఒక్క నిమిషం కన్న..
హా దొరికాయి లే “

” ఎందుకమ్మ ఈ కవర్స్ !”

” చెప్తాను మనం కిచెన్ రూంలోకి వెళ్దాము పద”
”  కన్న నువ్వు నాకు సాయం చేస్తావా!?”

” అమ్మ! ఎందుకు చేయను చెప్పు!  తప్పకుండా చేస్తాను “..

“చూడు కన్న! ఇక్కడ ఉన్న అన్ని రకాల స్వీట్స్  చిన్న కవర్స్ లో వేసి పిన్ చేసి ఈ స్వీట్స్ బాక్స్ లో నీట్ గా సర్దాలి ఇలా ఐదు బాక్స్ రెఢీ గా ఉంచాలి ఒకే నా కన్న”

” ఒకే అమ్మ! నువ్వు అంటు ఉంటావుగా మనసు పెట్టీ చూస్తే ప్రతిదీ మనకి నేర్పిస్తుందని..ఈ స్వీట్స్ కూడా మనకు నేర్పిస్తాయా !?”
” అవునా రా కన్న ! నేను చెపుతుంటాను నువ్వు వింటూ స్వీట్స్ బాక్స్ సిద్ధం చేయు..నేను కూడా నీకు పని చెప్తూ సామాన్లు

” అలాగే అమ్మ “..

“సాఫ్ట్ గ ఉందాము! అది ఎప్పటికీ మనకి బలహీనత  కాదు కొన్ని సంధర్భాల్లో అది మనల్ని కాపాడుతుంది అని గులాం జామున్”

” ఎప్పుడు డైమండ్ లాగా నువ్వు ఉన్న ఫీల్డ్ లో వెలగాలి అని కాజు కట్లీ “

“ఎన్ని ఇబ్బందులు నీ లైఫ్ లో వచ్చిన సరే నువ్వు నీ లాగే ఉండు,అప్పుడే నీకంటూ ఒక స్పెషల్ పేరు ఉంటుంది అని రసగుల్లా “

” నువ్వు ఎలా ఉన్నావు ,ఎలాంటి కలర్ లో ఉన్నావు అనేది  ఇంపార్టెంట్ కాదు. నీకంటూ ప్రతిభ ఉందా లేదా అనేది ముఖ్యం. అదే అందరిలో నువ్వు స్పెషల్ అనేలా చేస్తుంది అని జిలేబి “

“అందరూ నిన్ను ఇష్టపడకపోవచ్చు కానీ నువ్వు ఏంటో తెలిసిన వాళ్ళు నిన్ను  వదలరు అని
సోన్ పాపిడి “

“ఒక్కోసారి నువ్వు చేసే చిన్ని కష్టం కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది అని లడ్డు “

“నువ్వు ఎన్ని కష్టాలు ,బాధను భరించిన తట్టుకొని నిలపడాలి అని బేసన్ లడ్డు నేర్పిస్తుంది “

“నిజమే అమ్మ! స్వీట్స్ బలే రుచిగా ఉన్నాయి అనుకుంటు తినడమే తప్ప ..వాటి వెనుక  ఇంత అర్థం ఉంది అని తెలియలేదు.నువ్వు కథ చెప్పే లోపు నేను స్వీట్స్ బాక్స్ ఆర్రంజ్ చేశాను “

“వెరీ గుడ్ కన్న. దా మనము షాపింగ్ కి వెళ్దాము దీపావళి వస్తుంది కదా దీపాలు ,ఇంకా కొన్ని వస్తువులు కొందము”

అరగంట లో బజారు కి చేరుకున్నారు ఇద్దరు…
వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని ,స్వీట్స్ బాక్స్ ఇచ్చారు ఆ బజారులో అమ్మే వాళ్ళకు..ఇంకా ఒక బాక్స్ మిగిలింది…

” అమ్మ! ఆ షాప్ లో చూడు ఎంత కలర్ ఫుల్ దీపాలు అది కూడా డిఫరెంట్ డిజైన్ లో ఉండి బలే ముద్దుగా ఉన్నాయి .. అవి కొందము..”

” వద్దు కన్న! మనం డిజైన్ లేని దీపాలు తీసుకొని మనం మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుందాము.ఒకే నా!”

” వావ్! గుడ్ ఐడియా అమ్మ! అలాగే చేద్దాము..”

” కన్న మట్టి దీపాలు అమ్మే ఆమె దగ్గరకి వెళ్ళి దీపాలు  తీసుకొని ఆమెకు స్వీట్స్ ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు చెప్పి రా.నేను ఈ లోపు పూలు తీసుకుంటాను”
అలాగే అమ్మ…

” అమ్మ ఈ  దీపాలు ₹ 10 ఇవ్వండి అని చెప్పి దీపాలు తీసుకొని..మీకు దీపావళి శుభాకాంక్షలు అమ్మ అంటు స్వీట్స్ బాక్స్ ఇచ్చాడు…”

ఆమె నవ్వుతూ తీసుకొని ! ఈ దీపాలు అన్నీ అమ్మితేనే మాకు నిజమైన దీపావళి కన్న..స్వీట్స్ ఇచ్చి నందుకు ధన్యవాదాలు…”
ఇది విని ఫాస్ట్ గా వాళ్ళమ్మ వైపు వెళ్ళాడు..

” ఏమైంది రా కన్న! ఎందుకు అంత ఫాస్ట్ గా నా వైపు వచ్చావు…”
” అమ్మ! నీ పర్స్ లో ఎంత డబ్బుంటే అంత ఇవ్వు ! నేను దీపాలు అమ్మే ఆంటీ కి ఇస్తాను..”

” రేయ్ కన్న ! అలా ఇస్తే వాళ్ళు తీసుకోరు కన్న. కష్టించి పని చేసే వారు ఎప్పుడు కూడా ఉరికే వచ్చే డబ్బుకి ఆశ పడరు.. అలా అని అన్నీ దీపాలు మనం కొనలేము..మనసు పెట్టీ ఆలోచిస్తే చాలు సాయం ఎలా అయిన చేయచ్చు .. ఆలోచించు కన్న నేను ఈ లోపు పూజ సామగ్రి కొనుకొన్ని వస్తాను”

“ఆ దారిలో ఎంతో మంది వెళ్తున్నారు కానీ ఒక్కరూ కూడా ఆ మట్టి దీపాలు కొనలేదు… ఆమె బాధ గా దీపాలు వైపు చూస్తూ ఉన్నారు .”

”  కన్న ఐడియా వచ్చిందా!”

” హా అమ్మా ఫోన్ ఇవ్వు అంటూ ఆ దీపాలు అమ్మే దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక్కసారి ఈ ఫోన్ వైపు చూసి ఒక్కసారి నవ్వండి.  “

” ఆమె ఫోన్ వైపు చూస్తూ నవ్వింది.. ఆ బాబు ఫోటో తీశాడు”

ఇలాగే నవ్వుతూ ఉండండి మీ దీపాలు అన్నీ అమ్ముడు అవుతాయు అని చెప్పేసి వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళారు

” అమ్మ ! నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటీకి వెళ్దాము”

” అమ్మ నీ లాప్టాప్ ఇవ్వు అని తీసుకొని మొబైల్ లో ఉన్న ఆ దీపాలు అమ్మే ఆమె ఫోటోను సిస్టమ్ లో సేవ్ చేసుకొని ఆ ఫోటో ను తీసుకొని అందగా డిజైన్ చేశాడు..”

” ఈ అమ్మ సంతోషంగా దీపావళి జరుపుకునేలా చేయండి” అంటు అందమైన శీర్షికను జోడించాడు..
ఆమె ఎక్కడ దీపాలు అమ్ముతారు అనేది కూడా అక్కడ చిరునామా పెట్టారు..

వాటిని ప్రింట్ తీసుకొని తన వీధిలో ఉన్న వారికి,తెలిసిన వారికి పంచి పెట్టాడు.గోడల పై పోస్టర్ లు అట్టించాడు …

తరువాతి రోజు ” అమ్మ నాతో పాటు రా అంటూ ఆ బజారుకి వచ్చారు”

” ఎందుకు వచ్చాము రా కన్న ఇక్కడికి”

” అమ్మ !  ఈ పోస్టర్ ఒక్కసారి చూడమ్మా నిన్న నాకు వచ్చిన ఆలోచన ఇదే

అటు చూడమ్మా ఒక్కసారి అంటు దీపాలు అమ్మే ఆమె వైపు చూపించారు…

ఆ పోస్టర్ లు చూసిన  చాలా మంది అక్కడకి వెళ్ళి దీపాలు కొనుకున్నారు.. దీపాలు అమ్మే ఆమె మొహంలో ఎంతో సంతోషం కనపడుతోంది…
వాళ్ళు చూస్తుండగానే అన్నీ దీపాలు అమ్మడు అయ్యాయి! ఆమె నవ్వుతూ డబ్బులు లెక్క పెట్టుకుంటు ఉన్నారు”

” కన్న దా ఆమె దగ్గరికి వెళ్ళి ఇద్దంతా నా బంగారు కొండ చేశాడు అని చెప్పదాము “

” అమ్మ! నువ్వే చెప్పావు కదా మనం చేసే పని కనపడాలి అని..మనం కాదు అని..ఆ అమ్మకు సాయం చేయాలి అనుకున్నాము చేసాము..నేనే చేశాను అని ఎందుకు చెప్పాలి . ఆ అమ్మ మొహం లో వస్తున్న హ్యాపీనెస్ చాలు “

” శబాష్ కన్న… ఐ యాం ప్రౌడ్ ఆఫ్ యు…”

” ఈ దీపావళి పండుగ అసలు సిసలైన పండుగ మనకి..దా ఇంటికి వెళ్ళి దీపాలు డిజైన్ చేద్దాం ఇంటికి అని ఇంటికి చేరుకున్నారు ఇద్దరు …

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!