మనోకొలను

(అంశం:”సంధ్య వేళలో”)

మనోకొలను

రచన: చంద్రకళ. దీకొండ

కొండగట్టు పైకి చేరుకొనేలా మెట్లు…
మెట్ల చుట్టూరా పరచుకున్న పచ్చని ప్రకృతి…
ప్రకృతి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ…
కెంజాయరంగును పులుముకొన్న సాయంసంధ్య…
సాయంసంధ్యలో
గోధూళి అలముకున్న పరిసరాలు…
పరిసరాలలో లయగా మ్రోగే
జేగంటలు ప్రతిధ్వనిస్తూ
ప్రశాంతమైన కోవెల…!
కోవెల ప్రక్కనే ఆకుపచ్చని కోనేటిలో…
కోనేటిలో కలువలు, కెందామరాలు అందాలొలుకుతూ…
అందాలొలికే చందాల
కోనేటి గట్టుపై చల్లగా తాకుతూ
సేదదీర్చే మలయమారుతం…!
మలయమరుతం సుమసౌరభ
తావి తోడుగా రాగా…
చీకటి పడగానే చంద్రోదయం…
చంద్రోదయంతో విప్పార్చిన
వదనాలతో కలువలు…
కలువలతో కళకళలాడే కొలను…
కొలనులో ప్రతిఫలించే
చంద్రబింబం వెంటే
మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు…!
నక్షత్రాల్లా మెరిసే మనోభావనలతో…
మనమే ఓ ప్రశాంత కొలనైతే…
కొలనైతే మనసులో తరంగాల వంటి ఆశావాద భావాల వెలుతురు…
వెలుతురు…
సమస్యా తిమిరాన్ని తరిమేయదూ…?!?!
*******************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!