(అంశం:”సంధ్య వేళలో”)
హృదయాంజలి
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
*సంధ్యవేళ* ప్రకృతి శోభ వర్ణింపరానిది…
కాంతులీను రవి కిరణాల ధగ ధగలు ..
వెలుగులు పంచెనే తొలి అరుణ కిరణాలు…
నిదుర లేపెనే నవ చైతన్య భాను కిరణం…
మదిలో నూతన జీవం ఆవిర్భంవించెనే…
ఉదయించే సూర్యుని సింధూర శోభ…
అలుపు లేని భానుడి తాపం…
నీలి ఆకాశాన ఎరుపు వర్ణం సంతరించెనే…
ఆనందపు మేఘాలు చుట్టుముట్టెనే….
అల గగనాన పక్షుల కిలకిలల సమూహం…
తొలి సంధ్య ఉషోదయ కిరణాలు..…
సృష్టికంతటికీ మేల్కొలుపు పాడే…
సంకల్ప బలంతో సృష్టి చైతన్య విన్యాసం తో….
ప్రభాత కిరణాలు స్వాగత గీతాలు పలికే…..
ప్రకృతి ఒడిలో నా మనసు మురిసెనే *సంధ్య వేళ లో*
***