వంశవృక్షం

వంశవృక్షం

రచన :: పుల్లూరి సాయిప్రియ

అందమైన హరివిల్లును నింపుకున్న పొదరిల్లు..
కుటుంబ సంబందాలు..మనం పంచె మమతానురాగలకు పుట్టినీళ్లు..
ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, సరదాలు, వినోదాలు, విలువలు, సాంప్రదాయలు, జ్ఞానం, బుద్ది, కుశలతలు అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పొతే ఇంక ఎన్నో..మరెన్నో..ఇవన్నీ ఒక ఉమ్మడి కుటుంబంలోనే పొందుతాము.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబం అనేది ఒక “వంశవృక్షం”.
కాని ఇప్పుడు అందరు ఆ వంశవృక్షాన్ని వేర్లతో సహ పికిలించి వేసి స్వార్ధాన్ని వెంట బెట్టుకొని స్వేచ్చ అనే పేరుతో దూరంగా ఉంటున్నారు. కాని వాళ్ళకి తెలీదు పాపం అది స్వేచ్చ కాదు వాళ్ల అమాయకత్వం అని.,
కష్ట కాలంలో మన కన్నీరును పంచుకునే వారు, ఆనంద సమాయంలో మన సంతోషాన్ని పంచుకునే వాళ్లు ఒక ఉమ్మడి కుటుంబంలోనే దొరుకుతారు.
ఎవరైతే కుటుంభాన్ని విడిచి ఒంటరిగా జీవించాలనుకునే వాళ్లు ఉంటారో వాళ్లు నా ద్రుష్టి లో శూన్యం తో సమానం.
దయచేసి ఇప్పుడున్న ఉమ్మడికుటుంభాలనైన ఒక “వంశవృక్షం”లా నిలబెడుదాం.మన వంశాన్ని కూడ కాపాడుకుందాం.
“కలిసి ఉంటే కలదు సుఖం” అని అంటారు పెద్దలు
మరి ఆ పెద్దలు చెప్పిన మాటను గౌరవిద్దాం..
గౌరవించి వాళ్ల మాటను నిలబెడదాం..కలిసి ఉందాం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!