అందమైన నీ ఊహలు

అందమైన నీ ఊహలు

రచన:: జయకుమారి

అందమైన నీ ఊసులన్ని ఒక్కటై
నను నిలువెల్లా తడుముతూ
ఉక్కిరిబిక్కిరి చేసే అల్లరి చేస్తున్నాయి.

నా అందెల రవములు నీ చిలిపి నవ్వుల జతకై
తెగ ఆరాటపడుతున్నాయి.

నా ఎద చిరుసవ్వడి చేస్తూ నీ సేవకై ఆశగా ఎదురుచూస్తున్నాయి.
నా నీలి కళ్ళు నీ కొంటె చూపుకై

నా నడుముఒంపులు వెచ్చని నీ చేతి స్పర్శ కై.
నా అధరాలు మధువులులోలికే నీ పెదవుల జతకై.

సిగ్గుతో ఎర్రబడిన నా బుగ్గలు నీ ముద్దుకై
నా మేను వెచ్చని నీ కౌగిలికై..
నా హృదయం కమ్మనైనా నీ ప్రేమ కై.

వెన్నెల్లో కలికి చిలకనై..
నువ్వు పంచే ప్రేమ సుమగంధల పరిమళాలలో
పరవశించి పులకించిపోవాలని.

నిను తాకే చిరుగాలిలా అల్లుకుపోవాలని
నను ఊరిస్తున్నాయి.
నేనే నువ్వైపోయే వరమిస్తావా.!

రాముని వెనుక సీతనై.
కృష్ణుని మదిలో రాధనై
నూరేళ్ళ నా ఊపిరిని నీకు కానుక గా ఇచేస్తా.!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!