ప్రకృతి – విశేషతలు

ప్రకృతి – విశేషతలు

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

ప్రకృతిలో వింత విశేషతలెన్నో
నేర్పుకు కొన్ని, ఓర్పుకు ఇంకొన్ని
తెలివికి కొన్ని, చెలిమికి మరికొన్ని
మంచికి కొన్ని, మమతకి మరికొన్ని

గాత్రానికి కొన్ని, నాట్యానికి ఇంకొన్ని
కూటికీ గూటికీ కొన్ని,బట్టకి మరికొన్ని
అందానికి కొన్ని, అనుకరణకి ఇంకొన్ని
శౌర్యానికి కొన్ని, విశ్వాసానికి మరికొన్ని

పక్షులు,జంతువులు,కీటకాలు,చెట్లు
ఆకట్టుకుంటున్నాయి అలా మనల్ని!
తమ తమ విశేషతలతో ఎంతగానో
పొందుతున్నాయి మన ఆదరణల్ని!!

పొందాలి మనం కృతజ్ఞతాశీర్వాదాలు
మన శ్రమ శక్తులతో వాటిని సంరక్షించి!
పొందాలి మనతోటివారి అభిమానాలు
మన గుణ గణాలతో వారిని మెప్పించి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!