నాలోని భావనలు
రచన: విజయ మలవతు
అమ్మ అనే మధురమైన
పిలుపునే కానుకగా ఇచ్చి ,
నా లోకంలో …
నేనంటూ నాకు ….
నాకంటూ ఎవరూ లేకున్నా…
నేనున్నానంటూ
కన్నీళ్లు తుడిచిన చేయి
మనసుకు కష్టం కలిగించక..
సాగించే నీ పయనం..
లోకాన్నే అర్థం చేసుకున్నావేమో
అనేంతలా ఎదిగిన నీ అడుగుల సవ్వడి…
ఓదార్చే సమయాన
భారాన్ని మోసే బాధ్యత నీవే ఆనేలా..
పెద్దరికాన్ని అట్టిపెట్టుకున్న నీ గాంభిర్యం
జీవితానికి మేలుకొలుపు నువ్వేగా…
అంతరంగాన మెదిలే ఊహలనే
అవిష్కరిస్తే వచ్చే నా భావనలు ఇవే కన్నా.