అమ్మమ్మ పట్టుచీర

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
అమ్మమ్మ పట్టుచీర 
రచన:: చెరుకు శైలజ

అమ్మ అన్ని సర్దుకోవడం అయిందా! అంటు అమెరికాలో ఉన్న కూతురు లావణ్య దగ్గరి నుండి ఫోన్. అయితుందే
వారం రోజుల టైం ఉంది కదా! తల్లి సరోజ అంది.లేదమ్మ తీర టైంకు హడావుడి ఉండొద్దు. నాలుగు రోజుల్లో పూర్తి చేసుకో . మరల ఏమైనా మరిచిపోతే చూసుకోవచ్చు. లగేజ్ ఐదుసూట్ కేస్లు అయ్యేటట్లు ఉంది. మీ నాన్నగారు రెండు సర్దుకున్నారు. వద్దంటే ఒక సుట్కసులో మొత్తం పుస్తకాలు పెట్టుకున్నారు. అన్ని ఎందుకు కండి అంటే. నాకేమి తోచదు. మీ ఆడవారికైతే పనులు ఉంటాయి. మరి నేను ఏమి చేయాలి అంటున్నారు. సరే కాని అమ్మ వెయిట్ బట్టి ఆలోచిందాం.
రేపు ఊరు నుండిఅమ్మమ్మ వస్తుంది. నీ కోసం ఏమేమి తెస్తుందో ఏమో! అమ్మ నాకు ఒకటి గుర్తుకు వచ్చింది అమ్మమ్మను అడగాలి. ఏమిటే? తన పట్టుచీర కావాలమ్మ!
నా పుట్టపోయే బిడ్డ కోసం ఊయలలో వేయడానికి పెద్ద వారివి వేస్తే మంచిదట కదా! .ఎంతో మంచి ఆలోచన అడుగు అంటు ఫోన్ పెట్టేసింది సరోజా.
ఏమిటే అమ్మాయికి నామీద చాడీలు చెప్పుతున్నావు .
లగేజ్ గురించి అడిగితే
మీ పుస్తకాల గురించి చెప్పను. నువ్వు తీయాలంటే నా పుస్తకాలు అయితే తీయను. తక్కువ కావాలి అంటే నీ చీరెలు తగ్గించుకో అన్నాడు. సరిపోయింది నా చీరెల మీద పడింది మీ దృష్టి . అదే చెస్తాను లెండి బరువు ఎక్కువైతే అంటు సరే రండి భోజనం వడ్డిస్తాను అంటు పిలిచింది.
వేణుగోపాల్ సరోజకు ఒకతే కూతురు లావణ్య వేణుగోపాల్రావు రిటైర్మెంట్ ముందే కూతురు పెళ్లి ఘనంగా చేశాడు. అల్లుడు అమెరికాలో సాప్ట్ వేర్ కూతురు కూడా ఇంజనీరింగ్ చేసి అక్కడ యం.ఎస్ చేసింది.
ఒక సంవత్సరం జాబ్ చేసింది .ఇప్పుడు ప్రెగ్నెంట్ .
6వ నెల అందుకే కూతురు దగ్గరికి ప్రయాణం అవుతున్నారు. వీళ్ళు డెలివరీ వరకు ఉండి వస్తే
ఆ తర్వాత వాళ్ళ అత్త మామ వెళ్లుతరట లావణ్య చెప్పింది.
రేపు అమ్మ వస్తుంది. అమ్మకు మేము ఇద్దరం నేను తమ్ముడు.
ఊరులో వ్యవసాయం పనులు చూసుకుంటూ అక్కడే ఉంటుంది. నాన్న గారు పోయిన కూడా నా దగ్గర , తమ్ముడు దగ్గర వచ్చి ఉండమని అంటే వినదు. నెలకు ఒకసారి ఇద్దరి దగ్గరకు వచ్చి వెళ్లుతుంది.వచ్చె ముందు ఎన్నో పిండి వంటలు, కూరగాయలు, పండ్లు తీసుకోని వస్తుంది. ఎందుకమ్మా? ఇవి అన్ని కష్టంగా మోసుకురావడం అంటే ఏమైతుందే? ఊరులో ఎందరీకో పెడుతాను. మన ఛేనులో కాసినవి. నా పిల్లలు తిన్న వద్దా అంటుంది.
రేపు మనవరాలి కోసం ఏమి తెస్తుందో? ఏమో?
అందుకే ఒక సూట్కేస్ ఖాళీ గా ఉంచాలి అనుకుంటు సరోజా నిద్ర లోకి జారిపోయింది.
హాల్లో అమ్మమ్మ నేను లావణ్యను అమ్మమ్మ
నా తల్లే ఎలా ఉన్నావు రా కామేశ్వరమ్మ అంది.
నేను బాగున్నాను అమ్మమ్మ. నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను తల్లి .
సాయంత్రం అమ్మ దగ్గరకు వెళ్తున్నాను రా అంది.
అది తెలిసే ఫోన్ చేశాను అమ్మమ్మ.
నాకు నీ పాత పట్టు చీర కావాలి అమ్మమ్మ అంది. పాతాది ఎందుకు రా !నీకు కొత్తది కొని అమ్మ తో పంపిస్తాను.
అమ్మమ్మ నీ పట్టుచీరనే కావాలి.
నా పుట్టబోయే బిడ్డకి ఊయలలో ఆ చీరవేసి పడుకోబెట్టి పేరు పెట్టాలి.
మా అత్త గారి అమ్మను పెద్ద ఆవిడ అని పట్టుచీర అడిగితే!
నేను ఇవ్వను. నా పాత కాలపు జ్ఞాపకాన్ని అందట మరల తిరిగి ఇస్తాను. అన్న నమ్మడం లేదట, కొందరు అంతే అమ్మమ్మ చాదస్తం అర్ధం చేసుకోరు అంది. అప్పుడే నువ్వు గుర్తుకు వచ్చావు. తప్పక ఇస్తావు అనిపించింది. ఇస్తావా? ఓసి నీ ఇల్లు బంగారంగాను నువ్వు అడిగింది
ఏమైనా లక్షలా, కోట్ల నా పట్టుచీరనే కదా తల్లి దానిదేముంది ఇప్పుడే సూట్కేస్లో పెడతాను.
నాకు ఆ చీర లక్షల కన్న వీలువైంది అమ్మమ్మ . తొట్లేలో ఆ చీర వేసి పడుకో బెట్టడం వలన మీలాంటి పెద్దల దీవెనలు ఉంటాయట.మంచి ఆశీస్సులు లభిస్తాయట అమ్మమ్మ
ఎంతో పెద్ద విషయం చెప్పావే! అప్పుడే పెద్దదానివి అయిపోయావు . ఇక్కడ మా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. థాంక్యూ అమ్మమ్మ .
నీవు కూడా అమెరికా వస్తే బాగుండేది.
ఈ సారి కుదురదు రా!
ఇంకోసారి నా ఒళ్లు సహకరిస్తే తప్పకి వస్తాను. బై అమ్మమ్మ అంటు ఫోన్ పెట్టేసింది. మనవరాలు చెప్పిన ఆ మాటతో ఎంతో ఉప్పొంగి పోతు ఆ చీర తీసుకొని కూతురు దగ్గరికి ప్రయాణమైంది కామేశ్వరమ్మ.
కూతూరితో మనవరాలు తెమ్మన్న చీర గురించి చెప్పి ఆ చీర తీసి కూతురుకి ఇస్తు, కూతురు అన్న మాటలు తల్లి చెప్పుతుంటే విన్న సరోజా తన కూతురు అంతా పెద్ద మనసుతో ఆలోచించినందుకు ఎంతో మురిసిపోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!