ఒక చిన్న మాట

ఒక చిన్న మాట

రచన: శ్రీదేవి విన్నకోట

ఒక చిన్నమాట
చెప్పాలని ఉంది నా నోట
వింటారా మీరంతా ఈ పూట
ఓ మనసున్న మంచి మాట.

అందరూ ఒకరికి ఒకరు
ఒకరి కోసం ఒకరై
కలిసి ఉంటే కలదు సుఖం

జాతి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా
శాంతంగా స్నేహపూర్వకంగా
అందరినీ ఒక్కటిగా కలుపుకు పోతూ
ఒకే మాటగా ఒకే తాటిపై ఒకే తీరుగా
మన పయనం ముందుకు సాగిపోతే
అదే  మన దేశపు  కొత్త వెలుగు

మనకొచ్చే కొత్త దనాల కొలువు
మన అంతులేని ఆనందానికి చూడ చక్కని నెలవు

మన ఎన్నో ఆకాంక్షలు తీరే అనువు,
మన అందరిని కలిసికట్టుగా ముందుకి
నడిపించే  మన అరుదైన ఆయువు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!