ఇంకెక్కడ నువ్వు.?

ఇంకెక్కడ నువ్వు.?

రచన: పద్మజ రామకృష్ణ.పి

నన్ను నేను వెతుకుతున్నాను
తెలియకుండానే బాల్యం కరిగిపోయింది

వరమై వచ్చిన యవ్వనం కళ్ళముందే
మోడై వాడిపోయింది

వృద్దాప్యంతో అప్పటి బోసినవ్వుల
మలిదశ బాల్యాన్ని తెచ్చింది.

వాడిన మలిదశ బాల్యం శవపేటికకు
చేరి దేహ ఖననాన్ని కోరింది

ఇంకెక్కడ నేను.!నాదని మురిసే
ముచ్చట ముగిసే పోయింది

అశాశ్వతమైనవి శాశ్వతమని
శాశ్వతమైనవి అశాశ్వతమని
తలచే జీవుడి తలపులే
తంటాలు తెస్తుంటాయి

వందేళ్లు ముందే ఊహిస్తే ఉలిక్కిపడి
తాత్కాలికవైరాగ్యాని తడుముతావు
ఇంకెక్కడ.!నువ్వు.?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!