ఆనందం
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
పసిపాప బోసి నవ్వులు ఆనందం
లేగదూడ చిందులాట ఆనందం
మది మెచ్చిన స్నేహితులతో కేరింతలు ఆనందం
ప్రేమతో పెట్టే గోరుముద్దలు ఆనందం
శరీరాన్ని తాకే చిరుగాలి ఆనందం
నచ్చిన వారి నోటివెంట మన పేరే ఆనందం
వారి నోటితో పిలిచే పిలుపు ఆనందం
పచ్చని ప్రకృతి ఒడిలో ఆనందం
ఎగసిపడే కెరటాలు పంచేను మరో ఆనందం
చుట్టూ ఉన్న బంధువులతో బంధం ఆనందం
తోటివారితో కలిగే తోడు ఆనందం
అయిన వారితో పంచుకునే మనసు ఆనందం
మనసు తెలిసిన వారితో జీవితమే ఆనందం
ఎదుటివారితో పోలిక మనకొద్దు
పక్కవారితో మంతనాలు వాడవద్దు
మనసుకు నచ్చిన పని చేస్తే ఆనందం
నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటే అదే బ్రహ్మానందం.