మిర్చి బజ్జి
రచన: రాధ ఓడూరి
సాయం సంధ్యవేళ బాబారావు మేడ సెంటర్ నందు
ఉల్లి, నిమ్మరసం తోడై
మిర్చి బజ్జీల గుభాళింపులు
శివాజీ కేఫ్ సెంటరందు
మసాలాల కౌగిటిలో
కారా మిర్చి మేళవింపు
బందర్ రోడ్డు కాడ
ఆలు, పనీర్ చెలిమితో
సన్న మిరప బజ్జీలు
బిసెంట్ రోడ్ కూడలి
పెప్పర్ చెంత ఒదిగే
కారంలేని పెద్ద మిర్చీలు
బజ్జీలందు మిరప బజ్జీలు
అందునా విజయవాడ
మిర్చి బజ్జీల రుచే వేరు
*******************
