న్యూ బిజినెస్

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

న్యూ బిజినెస్

రచయిత :: చలిమేడా ప్రశాంతి

మానవత్వమా మానవత్వమా నువ్వు ఎక్కడ అని అడిగితే
పైసానే పరమాత్మ  అనే వాళ్ళ జేబులో దాక్కున్నాను అంటుంది.
మానవత్వమా మానవత్వమా నువ్వు చేసే మాయ ఏమిటి అని అడిగితే
పేదవాడికి బీర్లు ధనం  ఇచ్చి ఓట్లు వేయించుకునే రాజకీయానాయకుల ముసుగులో చేసే మాయ నాది అంటుంది.
మానవత్వమా మానవత్వమా నువ్వు చేసే మంచి ఏమిటి అని అడిగితే
ఆరోగ్యం బాగుపడాలి అని వైద్యం కోసం వొస్తే అనేక రోగాలను ఉన్నాయి అని చేపి లక్షలో లాభార్జన చేయడం.
ఇంటికి వంటికి తినడానికి అవసరమైన ముడిసరుకులను తక్కువ ధరకే అంటూ డిస్కౌంట్ అంటూ కల్తీ చేసి అమ్ముకోవడం.
ఫ్రీ అంటూ ఎక్సట్రా చర్జెస్ వేస్తూ మధ్యతరగతి కుటుంబాలను బాధ పెట్టడటం.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెతే వారిని ఇంకా పరిగెత్తేలా చేయడం.
కూటి కోసం రూపాయి రూపాయి దాచుకున్న మద్యం మత్తులో దోచుకోవడం.
సొంత ఇంటి కల కోసం ఉన్నచోటనే అమ్ముకునే లా చేయడం. పేద వారి భూములో కోటలు కట్టుకోవడం.
ఇవే ఇవే నా మంచితనానికి మారు రూపాలు.
మానవత్వమా మానవత్వమా నిన్ను గుర్తించటం ఎలా అని అడిగితే
కరోనా కష్టకాలంలో చాలీచాలని జీతాలతో కొట్టుమిటాడుతున్న పేద ప్రజల కన్నీటిలో కరిగిపోతున్న.
ఆకలికోసం నేలపై చిన్న ముక్క దొరకపోదా అని ఆశగా వెతుకొనే జంతువుల ముఖముపై నాట్యం చేస్తున్న.
ధనవంతులు విమానాల్లో ఎగిరి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి  విదేశాలకు వెళుతుంటే పేదవారు  తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పక్క గ్రామానికి వెళ్లడానికి పడే అవస్థలో దాగి ఉన్నను.
మానవత్వం  మానవత్వమనే నా పేరు కూడా బడా  వ్యాపారస్తులు తమ స్వలాభం  కోసం వాడుకొనే కార్యక్రమం లో నిత్యం ప్రాణం పోసుకుంటున్న.
ఒకప్పుడు రోడ్డు కు అడ్డంగా ఉంది అనో,  ఇంటిని కట్టుకోడానికి ప్లేస్ లేదని, వ్యాపార విస్తరణ కోసం అని  చెట్లను ఎలా పడితే అలా నరికేసాము. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్  కోసం పరుగులు తీస్తున్నము.
ఇప్పుడు ఈ ఆక్సిజన్ రూపంలో కూడా  మానవత్వం అనేది బిజినెస్గా మరిపోయింది కదా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!