మారాల్సి వచ్చింది

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

మారాల్సి వచ్చింది

రచయిత :: బండి చందు


అవును నాకు కొంచెం చాదస్తం ఎక్కువే
మగాడిగా కాదు మొగుడిగా
చెప్పినా వినని అమ్మ
చెబితే వినిపించుకొని భార్య
చెప్పడానికి అవకాశం కూడా
ఇవ్వని అత్తామామ
ఇంటిగుట్టు బయటపడితే
ఇంటా బయటా ఇరుగుపొరుగుకి
ఇట్టే అలుసైపోతానని
స్నేహితుల ముందు
చేతకనివాడిని అవుతానని
నలుగురి నోట్లో నేనే నానుతానని
పనిగట్టుకుని పలకరించడానికి
పదిమంది వస్తారని
నేనెన్ని చెప్పినా ఎగతాళిగా
ఎద్దేవా చేయడానికి ఎదురుచూస్తారని
అనుభవించాకే అర్థమయ్యి
నిజంగానే చాదస్తపు మొగుడిగా
లోకం నిందించే మగాడిగా
మారాల్సి వచ్చింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!