(అంశం:: “చాదస్తపు మొగుడు”)
ఎట్టా వేగాలి నీతో
రచయిత :: అలేఖ్య రవికాంతి
తొలి కోడి కూత రాక మునుపే
లేమ్మంటాడే మడిగట్టకుండా
మంచినీళ్ళు ముట్టనీయడే
వేప పుల్లతో పళ్ళు తోమందే
ముద్ద మింగనీయడే
రుబ్బురోలులో నలగని పిండి
ఎండు గడ్డని నసపెడతాడే
పూటకో కొత్త రుచి కావాలంటాడే నూనె చెంచా ఎక్కువైతే అస్సలు ఊరుకోడే
పండగొచ్చే నెల రోజుల ముందే ఇళ్ళు దులపమంటాడే
తీరా దులిపినాక భూతద్దం పట్టి
కానరాని దుమ్ముని పసిగట్టి
మళ్ళీ కథని మొదటికి పట్టుకొస్తాడే
పెళ్ళాం చేసే ప్రతి పనిలో
వంద తప్పులు లెంకుతాడే
నువ్వు చేయవోయ్ పెనిమిటంటే ఆయుక్షీణం
అని పారిపోతాడే
ఎట్టా వేగాలోయ్ నీతో
ఓ చాధస్తపు మొగుడా
నువ్వు ఇంట్లో ఉంటే
పెళ్ళాం గుండె దడదడ!!