పెళ్లి

పెళ్లి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన-జ్యోతిరాణి

“పున్నమిచంద్రుడు వెన్నెలలు కురిపిస్తూ, ఆకాశం దుప్పటిని తీసి అందమైన రూపాన్ని చూసి తన రాయబారిగా చల్లని గాలులు పంపించార అన్నట్లు” తెరిచిన కిటికీ నుండి వీచే గాలులు ఒక అందమైన ముఖాన్ని తాకాయి. ప్రేమగా పంపే ఏ సందేశం మనుసుని చేరుతుంది. అనేలా ఆ గాలి తాకిడికి కనులను నెమ్మిదిగా తెరిచి చూసింది. కనులకు భాష ఉంటుంది అంటే నమ్మాలేమో, అంత చక్కని భావజాలంతో, ఒకసారి చూస్తే మళ్ళీ చూపు మరల్చలేకుండా ఆకర్షణగా కట్టిపడేస్తున్నాయి ఆ కళ్ళు.. ఆకర్షించే కనుల వెనుక ఉన్న కలలు, ఆ కనుల వెనుక ఉన్న బాధ తన మనసుకి మాత్రమే తెలుసు. తెల్లవారితే తన జీవితంలో వచ్చే పెద్ద మార్పు తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది సరిగా నిద్రను ఆహ్వానించలేకుండా ఉంది. మాములుగా తనకు చాలా ఇష్టమైన రోజు, ఈ రోజు అందమే అందంగా పుడితే ఇలా ఉంటుందా అన్నట్లు ఉన్న జాను పుట్టినరోజు..తనకి చాలా ప్రత్యేకమైన రోజు తన పుట్టిన రోజు..
“నేను ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నాను”మనసు ఎందుకు ఇంత మౌనంగా భారంగా ఉంది.నా జీవితం కొన్ని గంటలో మారిపోతుంది .
ఎప్పుడు అందరికి నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ఇప్పుడు ఎందుకు లేదు. నా మనసు ఏం కోరుకుంటుంది.అని ఆలోచనలో మునిగింది జాను.
తెల్లవారితే పెళ్లి..నాకు కావలసిన తోడు ఇతనేన అని, ఈ విషయం లో ఎందుకు మా అమ్మానాన్న ల మాట ఒప్పుకోలేకపోతున్న…నా మనసు ఎందుకు కుదురుగా లేదు ఒక్కోక్షణం ఒక్కో ఆలోచనని మోసుకెళ్తుందా అన్నట్లు వేగంగా పరిగెడుతున్నాయి. ఇల్లంతా పెళ్లి హడావిడి అంతా తన పెళ్ళికొసం జరిగే పనులు కానీ తను తన మనసు మౌనంగా ఉండిపోయింది..
జాను పడుకోమ్మా ఇక 4 గంటల్లో నీ పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. అని జానకమ్మ జాను వాళ్ళ బామ్మచెప్పి వెళ్ళింది..వెళ్తున్న బామ్మ వంక చూస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలనుకుంది..కానీ కారణం తన దగ్గర లేదు పెళ్లి ఆపడానికి,అలాగే ఏమి తోచని స్థితిలో ఉంది..
గడియారం వంక చూసే సరికి 11.59.50sec అవుతుంది..ఒక్కో సెకండ్ ముందుకు జరుగుతూ 12 అయింది..ఇంతలో తన మొబైల్ మెసేజ్ సౌండ్ వచ్చేసరికి మొబైల్ ఓపెన్ చేసి  మెసేజ్ చూసింది.. కొన్ని జ్ఞాపకాలు కళ్ల ముందర కదిలాయి..
ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చావో తెలీదు..చూడగానే తొలిసారి నచ్చిన రూపం..అలాగే తన గురించి తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం..అలా ఏర్పడిన పరిచయం ..ఏదోబంధం మనసులో నుండి ఎన్నో సార్లు మాట్లాడమని గిలిగింతలు పెట్టిన,మాట మౌనంగా సాగిన ప్రయాణంలో నాకు మొదటిసారి నచ్చిన నా మనసుకు దగ్గరైన పండు..నాకు నేను తనకి పెట్టిన పేరు..

డియర్ జాను

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు అది నీ పుట్టినరోజు కనుక. ఎప్పుడు ఎలా ఎందుకు నా జీవితంలోకి వచ్చావో తెలీదు నేస్తం అనే పదానికి సరైన అర్థం చెప్పావు.. హ్యాపీ బర్త్డే అని చదివాను. నా మనసు వెతుకున్న సమాధానము ఇదేనేమో..నాలో నేను అనుకున్నాను. సమయం గడుస్తున్నా కొద్దీ నా మనసు చంపుకొని బ్రతికే జీవితం కళ్ళ ముందర కనిపిస్తుంది. ఆలోచనలో ఉండగా.
బామ్మ వచ్చి జాను పక్కన కూర్చొని తనని కౌగిలించుకొని నుదిటిన ముద్దు పెట్టి నా బంగారు తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు జానకమ్మ..అంది..
ఓ బామ్మ నీ పేరుతో పిలువొద్దని ఎన్ని సార్లు చెప్పాలి. అని కొంచెం కోపంతో బుంగమూతి పెట్టుకొని అలిగింది జాను.
నా చిట్టితల్లి కోపంలో కూడా అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది నేను చూడొద్దు అని మూరిసిపోతుంది..
నీ పెళ్లి అని నీకు కూడా తెలియని పెళ్లి చేస్తున్నాడు మీ నాన్న…నివేమో చదువుల సరస్వతి వి చదువు అని అప్పుడు ఉద్యోగం అని ఇప్పుడు ఎప్పుడు నీలోకంలో నీవు ఉండేదానివి నిన్ను ఎన్నిసార్లు అడిగిన చెప్పలేదు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ,మీ నాన్న తో ఒప్పించి నేను పెళ్లి చేస్తా అని కానీ,ఏది లేదని చెప్పావు ,నీ మనవరాలికి ఏమైనా వ్యవహారాలు ఉన్నాయా అని అడిగాడు లేవని చెప్పాను..
అంతే కదా జాను ,నీకు ఇష్టమే కదా తల్లీ అని ప్రేమగా అడిగింది…
నేను చేస్తున్న పని తప్పో ఒప్పో తేల్చుకునే స్థితిలోలేను..బామ్మ నాకు ఇక్కడినుండి దూరంగా వెళ్లాలని ఉంది..మెదడు నువ్వు చేసే పని తప్పు అని చెప్తుంది నీకు నచ్చక వెళ్ళావని సమాజం అనుకోరు ఎవరితోనో,ఎవరికోసమో వెళ్ళావని అంటుంది..దాని ప్రభావం మీ కుటుంబం పై పడుతుందని వారిస్తుంది.
మనసు ఏమో ఉండేది ఒక్క జీవితం నచ్చిన వ్యక్తి తో జీవితాన్ని కోరుకుంటుంది…
అసలు ఇరువురు మధ్యలో మాటలు లేని మౌన ప్రయాణంలో పండు చేసిన సందేశంతో తనలోని ధైర్యాన్ని ప్రేమను తట్టిలేపిందా అన్నట్లు తన మనసులో మాట చెప్పేసింది..
తను ఎవరు అని అడిగింది జానకమ్మ..
తను మా బాస్ తనని చూడగానే ఇష్టపడ్డాను..తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు తను ఇంకా నచ్చారు ఆ ఇష్టం ప్రేమ గా చేసుకుంటే తననే చేసుకోవాలి అనేంత ప్రాణంగా ఎప్పుడు మారిందో తెలీదు..బామ్మ నేను చేసుకుంటే తననే చేసుకుంటాను గుండెలోతు ప్రేమను కళ్ళలో కురిపించింది ..
ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదు ఎం చేయాలో తెలియని కంగారులో అడిగింది జానకమ్మ..
ఇన్ని రోజులు తన మనసులో ఏముందో తెలీదు ఈ రోజు నాకు చెప్పిన విషెస్ లో తన మనసు అర్ధమైంది..అని చెప్పింది జాను..
జానకమ్మ మరి ఏం చేద్దాం ఇప్పుడు అని అడుగుతుండగానే,ఇంతలో  జాను వాళ్ళ నాన్న అమ్మ మిగితా చుట్టాలు హ్యాపీ బర్త్డే అని విష్ చేసి..నిన్ను పెళ్లికూతురుని చేయాలి అని తీసుకెళ్లడం..పెళ్లికూతురుని చేశాక మంగలస్నానాలు చేయడం ,పెళ్లికూతురిని రెడి చేసి కూర్చోపెట్టడం అన్ని జరిగిపోయాయి..
జాను గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అనేంతల మౌనంగా వచ్చిన ప్రేమ మౌనంగానే వెళ్తుందా..నా జీవితంలో ప్రేమా అనే అదృష్టాన్ని పొందలేనా అని..మనసులో కుమిలిపోతుంది..
మనమరాలు ప్రేమను గెలిపించలేక పోతున్న అని జానకమ్మ విలవిలాడుతుంది..ఈ రెండు గంటల్లో ఎన్నో సార్లు చెప్పాలని ప్రయతించిన, వాళ్ళ అబ్బాయి శేఖర్ కి చెప్పలేకపోయింది..
ఏది అయితే అది అనుకొని జీలకర్ర బెల్లం పెడ్తుండగా ఈ పెళ్లి ఆపండి ..ఈ పెళ్లి మా జాను కి ఇష్టం లేదు..
అని నిల్చుంది..
బామ్మ ని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది జాను మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ కూర్చున్నవారు లేచి నిల్చున్నారు..
ఇంతలో శేఖర్ నవ్వుతూ జానకమ్మ దగ్గరికి వచ్చి నువ్వు కాదు నీ మనమరాల్ని చూసి చెప్పమని అన్నాడు..
పెళ్ళికొడుకు ముందు ఉన్న తెర తొలిగిపోయింది..చూస్తే ఎదురుగా తను ప్రేమించిన తన పండు..మిస్టర్ రామ్ సీఈవో ఆఫ్ ఎయిర్సెల్ కంపెనీస్..
తన కళ్ళు మనసు ఆశ్చర్యం ప్రేమతో నిండిపోయాయి..నన్ను పెళ్లిచేసుకుంటావా జాను అని అడిగాడు.. ఐ లవ్ యు బాస్ అని చెప్పి సిగ్గుతో తలదించుకుంది,ఇరువురు జీలకర్రబెల్లం తలపై  పెట్టుకున్నారు. చూడముచ్చటైన జంటను చూసి అందరూ ఆశీర్వదించారు. నా బాస్ ఇప్పుడు నా ప్రేమగా వచ్చారా అని కొంటెగా కన్ను కొట్టింది…జాను

Ramjanaki..
పెద్దల పరువు పట్టింపులకు పోకుండా తమ కూతురి పెళ్లి విషయంలో తన అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఇంకా ఎన్నో పెళ్లిళ్లు జరుగుతున్నాయి,ఆ ఆలోచనధోరణి మారి తమ ఇష్టాల్ని తెలుసుకొని వాటిని పంచుకునే స్వేచ్ఛ కల్పించాలి అమ్మాయిలకు,తల్లిదండ్రులు..సరైనది అనిపించినప్పుడు పెళ్లిచేయడమో,లేక అనుభవంతో కుదరదు అనుకున్నప్పుడు ప్రేమగా నచ్చజెప్పి వేరే పెళ్లి చేయడమో చేస్తే తన మనసు పంచుకున్న అనే తృప్తి ఉంటుంది ఆ క్షణము బాధపడ్డ తర్వాత తల్లిదండ్రులను అర్డంచేసుకోగలదు…చెప్పే స్వేచ్ఛను ఇవ్వాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!