విజ్ఞాన భాండాగారం
(ప్రక్రియ: గేయం)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కొత్త ప్రియాంక (భానుప్రియ)
మనో వికాసపు సాధన్నోయ్
సమాజ తీరుతెన్నులెన్నో తెలుపుదునోయ్
చెరవాణి వదిలి నన్ను చేతపునవోయ్
తీర్చిదిద్దుతా నీ భవితనోయ్
మేధోసంపత్తిని మెరుగుపరిచెదనోయ్
మానసిక ఉల్లాసమే పంచెదనోయ్
జీవిత సత్యాలెన్నో వివరిస్తానోయ్
నీలోని జ్ఞానానికి సానపెడతానోయ్
సకల సమాచారాన్ని అందిస్తనోయ్
సత్యవాక్కులను సమర్పిస్తానోయ్
సదానన్ను స్వీకరించిఆదరించవోయ్
సమాజంలో నిన్ను ఉన్నత స్థానంలో నిలిపేదనోయ్