స్ఫూర్తి

స్ఫూర్తి
                                  (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)                               

రచన: బాలపద్మం

              అది కూపర్ హోటల్ డల్లాస్, టెక్సాస్ లో, సాయంత్రం విద్యుత్ కాంతులతో తళుకు తళుకు మంటూ ఉంది. అంగ రంగ వైభవంగా అలంకరణతో మధ్యలో సుజన వెడ్స్ శంకర్ అని ముచ్చటగా మెరుస్తున్న బోర్డ్ చూసి కారు పార్కింగ్ లో వాళ్ళని దింపి అమ్మ, నాన్న లతో తాను మళ్లీ మరునాడు వెస్తాను అని చెప్పి, సూట్ కూడా వాళ్ళ పేరు మీద బుక్ చేసి డిటైల్స్ ఇచ్చి వెళ్ళాడు అనిరుధ్. అనిరుధ్, మూర్తి, పద్మజ ల పెద్ద కొడుకు, డల్లాస్ లోనే బాగా సెటిల్ అయ్యాడు. వీళ్ళు ప్రతి ఏటా వచ్చి ఓ రెండు నెలలు ఉండి వెళ్తూ ఉంటారు. అయితే ఈ సారి వాళ్ళ యు ఎస్ ప్రయాణానికి మాత్రం ఈ పెళ్లి ప్రధాన కారణం. ఏవండీ మీ శిష్యుడు రామం ఫోన్ డల్లాస్ నుంచి, వాళ్ళ అమ్మాయి, మీ ముద్దుల మనుమరాలు సుజన పెళ్లి టా అంటూ ఫోన్ భర్త కి అందించింది పద్మజ. చెప్పరా రామం అన్నారు మూర్తి గారు.
బాబాయ్ మీరు చెప్పినట్టు సుజన పెళ్లి విక్రమ్ కొడుకు శంకర్ తో కుదిర్చి, వచ్చే నెల 13న ముహూర్తం పెట్టాం. మన అనిరుధ్ తో మాట్లాడి మీ టికెట్స్ వచ్చే ఆదివారం కి చేయిస్తున్నా. రెఢీ గా ఉండండి. పెళ్లి మొత్తం మీ ఆధ్వర్యంలో నే జరగాలి అని అభ్యర్థన తో కూడిన వినయం తో చెప్పాడు. మరి మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారుఅన్నారు మూర్తి గారు. వాళ్ళు క్రితం వారం వచ్చారు, ఇక్కడే ఉన్నారు అనే సరికి ఫోన్ పెట్టి హుషారు గా గంతులు వేశారు. అది చూసి పద్మజ చాలు హొయలు పడతారు జాగ్రత్త అంది. మనం తల్లి వృక్షాల మోయ్, పడం లే అన్నారు అంతే హుషారుగా. చూడు ఏర్పాట్లు అన్నీ, ఇక నాలుగు రోజులే సమయం మన ప్రయాణానికి అన్నారు. హా అలాగే అంది పద్మజ. చూసారా మన మాట అంటే ఎంత గురి మన రామానికి అనుకున్నారు. అవును మరి, మనం పూయించిన పూవులు కదా ఇవన్నీ అని ఒకసారి జ్ఞాపకాల లోకి వెళ్ళారు.
పద్మజ, మూర్తి గారు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనడం ఎంతో సమంజసం. ఇద్దరికీ పరోపకారం అంటే ఎంతో ప్రీతి. వీరికి ఇద్దరు పిల్లలు అనిరుధ్ ఎమ్ ఎస్ చేసి అమెరికా లో స్థిర పడ్డాడు. రెండో వాడు ఎమ్ టెక్ చేసి ఇక్కడే వైజాగ్ లో వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇద్దరి పిల్లలకి వారి స్నేహితుల అమ్మాయిలను ఇచ్చి కాదు తెచ్చి పెళ్లిల్లు చేసి అమ్మాయిల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఒక్కోసారి కోడళ్లను వారించి మరీ  పుట్టింటి కి పంపుతారు నాలుగు రోజులు ఉండి రమ్మని అంటే అర్థం చేసుకోవచ్చు వారి అన్యోన్యత. అన్నట్టు ఒక్కోసారి ఈ అమ్మ, అదే నండి వరుసకి అత్తే కానీ, కూడా ఉంటేనే వెళ్తా అంటుంది చిన్న కోడలు అదీ వారి బంధం. చేసింది ప్రైవేట్ ఉద్యోగం, చాలీ చాలని జీతం, మధ్య తరగతి ఇబ్బందులు మామూలే అయినా ఎంతో హుందాగా, ఉన్నతంగా గడుపుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూనే కనీసం ఓ పది మందికి ఎన్నో రకాలుగా సాయ పడి, వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగి స్థిర పడేలా చేశారు ఈ దంపతులు. అయితే కలి కాలం కదా కొందరికి వీళ్ళు ఇప్పుడు గుర్తు లేదనుకోండి. అయితే ఇప్పటికీ సొంత తల్లిదండ్రుల్లా భావించి గౌరవించే వారూ ఉన్నారు. వీళ్ళ పిల్లలతో బాటు ఎప్పుడూ ఎవరో ఒకరు వీళ్ళ ఇంట్లో ఉండి చదువు కునే వారు. అలా ఎంతో మందికి బాబాయ్, పిన్ని వీళ్ళు. వాళ్ళలో విక్రమ్, రామం కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకే పెళ్లిళ్లు. అయితే ఈ పెళ్లి కుదిరిన వివరం ఒకసారి తెలుసుకోవాలి. బాబాయ్ మన సుజన కి మంచి సంబంధం వచ్చింది తను డాక్టర్ కదా, అబ్బాయి కూడా ఇక్కడ డాక్టరే మీరు ఒకసారి వివరాలు చూసి సరే అంటే ముందుకు వెళ్దాం అని ఫోన్ చేశాడు రామం. మీరు చూడండి, అమ్మా నాన్నకు నచ్చితే సరే కదా అన్నారు మూర్తి గారు. అదేంటి బాబాయ్ మీరు సరే అంటేనే కదా ముందుకు వెళ్ళేది అన్నాడు. సరేనోయ్ వివరాలు పెట్టు, వాళ్ళిద్దరితో ఓ సారి నేను మాట్లాడాలి అన్నాడు. సహజంగా ఏ ముఖ్యమైన విషయం అయినా మూర్తి గారిని సంప్రదించకుండా అడుగు వెయ్యడు రామం. సొంత తండ్రికి ఇచ్చిన గౌరవం ఇస్తాడు. మరునాడు సుజన ఫోన్ చేసి, తాతయ్యా! నాన్న చెప్పారు కాదా అబ్బాయి శంకర్ కూడా ఇక్కడే ఉన్నాడు జూమ్ లో మాట్లాడతారా, ఫ్రీ ఉన్నారా అంది. నా సమయం మీకోసమే కదరా తల్లీ! కలుపు అన్నారు. అలా అమ్మాయి, అబ్బాయి తో చాలా సేపు మాట్లాడాక, ఇద్దరి అభిప్రాయాలు, ఆశయాలు కలుస్తాయి అని విషయం రామానికి చెప్తే పెళ్లి కుదుర్చుకున్నారు. అయితే ఇంతలో ఈ శంకర్ తండ్రి విక్రమ్ మన మూర్తి గారి సాయంతో చుదువుకుని కనీసం ఇప్పుడు తలవడం కూడా తలవని మనిషి అని తెలిసి రామం ఈ సంబంధం వద్దు అంటే సుజన కూడా సరే అంది. విషయం మూర్తిగారికి చెప్తారు. ఆయన తొందర పడకండి నేను శంకర్ తో మాట్లాడతా అని ఓ రోజు శంకర్ కి ఫోన్ చేస్తారు. అయితే శంకర్ తన తండ్రి లా కాదు, మంచి అబ్బాయి ఉన్నత ఆదర్శాలు ఉన్న అబ్బాయి అని, కొన్ని సంవత్సరాలు అక్కడే ప్రాక్టీస్ చేసి సుజన తో కలిసి ఇండియా కి వచ్చి మంచి హాస్పిటల్ పెట్టి పేదలకు సేవ చేస్తాడని తెలుసు కుంటారు. దానితో ఎంతో సంతోషంగా రామం కి సుజన కి విషయం చెప్పి, పెళ్లి కి ముందుకు వెళ్లమని చెప్తారు, మూర్తి గారు. ఇద్దరూ కేవలం మీరు చెప్పారని మాత్రమే ముందుకు వెళ్తున్నాం, అయితే విక్రమ్ కి మాత్రం ఇక పాఠం నేర్పాలి అంటారు. అదేం లేదు లేరా! మాట్లాడితే సరిపోతుంది వాడు బాగా ప్రాక్టికల్ మనిషి.  కొమ్మలన్ని తలో రకం గా పెరిగినా అవి కాచే ఫలాలు అన్నీ ఒకే రుచి రా, ఏం కంగారు పడకు అంటారు మూర్తి గారు. అయితే మీరు స్థాపించిన మన స్ఫూర్తి ట్రస్ట్ ద్వారా ఆ హాస్పిటల్ పెట్టి మనమే అది నడుపుదాం. దానికి తగిన ప్రణాళిక పెళ్ళికొడుకు తో కూడా సంప్రదించి చేసుకుందాం అనుకుంటారు అంతా కలిసి. అదీ అలా కుదిరింది ఈ పెళ్లి. హోటల్ అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలుగు సంప్రదాయం లో ఏర్పాట్లు అన్నీ ఘనంగా చేశారు  మూర్తి గారి ఆధ్వర్యంలో ఇంతలో మగ పెళ్లి వారు రానే వచ్చారు. వస్తూనే స్వాగత సత్కారాలు, ఏర్పాట్లు చూసి ఎంతో సంబర పడి లోపలికి వచ్చాకా మూర్తి గారిని చూసి, కాస్త ఆశ్చర్య పోయాడు విక్రమ్. మూర్తి గారే చొరవ తీసుకుని పలకరించారు. సిగ్గుతో కొంచెం ఇబ్బంది పడ్డా, ప్రాక్టికల్ మనిషి కదా పెళ్లి అయ్యాకా మాట్లాడదాం అని అప్పటికి పలకరించి, కుటుంబ వివరాలు అవీ కనుక్కున్నాకా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. పెళ్ళంతా సరదాగా ఆనందంగా జరిగింది, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాకా విక్రమ్ వచ్చి మూర్తిగారు, పద్మజ కాళ్ళ మీద పడి నమస్కరించి కళ్ళ నీళ్ళు పెట్టుకుని, తనని క్షమించమని మరీ ప్రాక్టికల్ గా బ్రతికేస్తూ, బంధాలను చివరికి నా జీవితానికి మూల స్తంభాలు అయినా మిమ్మల్నీ ఎప్పుడూ పలకరించక పోయానని సిగ్గు పడతాడు. శంకర్ ద్వారా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న ఎవరో వాళ్ళ బాబాయ్ కి రామం ఇచ్చే మర్యాద, మా కోడలు కాదు ఇప్పుడు మా అమ్మాయి సుజన ఆయనకి ఇచ్చే ప్రాముఖ్యత చూసి ఎవరా అనుకున్నా, ఇక్కడికి వచ్చాకా కానీ తెలీలేదు అలాంటి వ్యక్తి మీరు కాక ఇంకెవరు ఉంటారు అని తనతో వాళ్ళ ఇంటికి రావాలని బ్రతిమాలతాడు. అయితే మూర్తి గారు ఇప్పుడు కాదులే, మరోసారి వస్తా ఇక్కడ ఇంకా పెళ్లికి సంబంధించిన పనులు ఉన్నాయి అని చెప్తారు.
అయితే నాదో విన్నపం కాదనకూడదు అంటాడు విక్రమ్. ఏమిటీ అన్నట్టు చూస్తారు అంతా. శంకర్, సుజన కొన్ని సంవత్సరాలు ఇక్కడ బాగా విజ్ఞానం నేర్చుకుని, ఇండియా లో హాస్పిటల్ పెడదామని అనుకుంటున్నారు. మన రామం, మీరు కలిసి నడుపుతున్న స్ఫూర్తి ట్రస్ట్ గురించి, వాళ్ళు పెడదాం అనుకుంటున్న హాస్పిటల్ గురించి చెప్పాడు శంకర్. ఆ హాస్పిటల్ నిర్మాణం ఖర్చు మొత్తం నాదే, మీరు ఒప్పుకోవాలి అంటాడు. దానికి కాదనేది ఏముంది, అందరూ ఎంతో ఆనందించారు. అయితే సుజన, మూర్తిగారు కలిసి శంకర్ తో అంతకు ముందే ఓ ప్రణాళిక ప్రకారం విక్రమ్ ని మార్చేశారు అని, దాని ఫలితమే ఇది అనీ ఈ తాతయ్య, మనుమలకి మాత్రమే తెలుసు. అదండీ ఈ స్ఫూర్తి కథ. ఒక్కొక్కరికి ఒక్కో విషయం, ఒక్కో మనిషి స్ఫూర్తి ఇక్కడ. అందరూ మంచి మనసు లతో ముందుకు వెళ్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది కదా!

***

You May Also Like

7 thoughts on “స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!