(అంశం : “సంధ్యవేళలో”)
కంటిని తాకిన అందం
రచన : చిరునవ్వు rj రాల్స్
పిల్లగాలి పైరుల్లో
గెట్టు అంచు దారుల్లో
సిన్న సిన్న అడుగుల్తో
సింగులెత్తిన సన్నజాజి
సంధ్యవేళ సంతకొస్తే
సరు సర్రున దుకేనా పాదం
జర్రనైనా ఆగేనా పానం
సిత్రమైన సిందులు
సిలక పచ్చ రంగులు
సిక్కునా..నాకీపిల్ల దక్కునా..
యాదిస్తా దాన్నే సాధిస్తా ……
సంధ్యవేళ సన్నీళ్లు
తీర్చేనా..పిల్ల ఎక్కిళ్ళు…
మనసిచ్చేస్తా..మనువాడేస్తా
సేయి లాగేస్తా..సక్కంగా సాకేస్తా..
***