చిరు దరహాసం

చిరు దరహాసం

రచన: విస్సాప్రగడ పద్మావతి

చిన్న చిరునవ్వు చేరువైన వేళ
చింతలను ఆపి ఆకలిని బాపి
మదిని ఉల్లాసంతో నింపుతుంది
కాసులు లేకున్నా
చిరు మందహాసం
కనక వర్షం కురిపిస్తుంది
వదనమున నవ్వు
ఎన్నటికీ వీడని పువ్వు
బాధనుబందీ చేసి
బంధాలను దగ్గర చేస్తుంది
సుమధుర దరహాసం
నిత్యనూతన మధుమాసం
చిన్న నవ్వు
కొనలేని ఆస్తి తూచ లేని ధనం
చిరు నవ్వు రువ్వితే
శత్రువులు మిత్రులు కాగలరు
నాలుగు విధాల చేటు ఒకప్పుడు
నవ్వు నాలుగు విధాల ఆరోగ్యం ఇప్పుడు
వీడకు ఎప్పటికీ నవ్వుల ఛాయలు
అవే బతుకుకు నయాగర హొయలు
వదనమున చిరు నవ్వు తొడిగితే
తొలకరి తన ఉనికే మరువదా!?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!