దునియా
రచన: చిరునవ్వు Rj రాల్స్
// ఎక్కడికి పోతుందో దారి
అమాయకానికి కట్టక తప్పదు ఘోరి..
షురయ్యే భవిష్యత్తుమీద కాయిషి లేదంటే
కాలం గూడా కసాయిగా ముద్రిస్తుందేమో..
ములిగే గొంగళి పురుగుని పూనిన దునియా
యాచకుడిలా జాజునిపూసి దద్ధులకు సద్దిచెప్తుందేమో..
మొదలు ఎర్కలేని గొర్రెలమంద ఏరునెట్ల దాటేనో …
నింగికి ఎగరలేని పక్షిబొమ్మ ఎదనెట్ల జేరేనో …
నాడు సంధుగొంధుల్లో మనిగే సతులను
నేడు మందుమత్తుల్లో మునిగే మతులను
నాస్తిక ఫకీరు తాయత్తులే మార్చేనా…
నోములు నోచే పరమాత్ముడే దిగొచ్చేనా…
నడవలేని రాయిని దేవుడిగా మార్చిన ఉపాయమే
మనిషిలో మానవత్వాని రాక్షసుడిగా మర్చిందేమో…
మొగ్గ భవిష్యత్తును అక్షరాల్లోనే జూపిస్తే….
సావులేని అన్యాయం మనిషి ఆణువణువుని కమ్ముకుందేమో ….
మ్రోగుతున్న మరణ మృదంగాల నాట్యం
ఇదే మా ఆహ్వానం అంటూ స్వాగతిస్తున్నాయేమో
ఎక్కడికి పోతుందో దారి
అమాయకానికి కట్టక తప్పదు ఘోరి….//