బామ్మగారు – బాబిగాడి పెళ్ళి

బామ్మగారు – బాబిగాడి పెళ్ళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

     “ఏమండోయ్ వింటున్నా రా! మీ గొడవ మీదే గాని నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారా! పొద్దస్త మానం పేపర్, టి.వి న్యూస్ క్షణం తీరికా లేదు,  దమ్మిడీ ఆదాయం లేదు వాలు కుర్చీలో కూర్చుని చూస్తూనే ఉంటారు. వారం రోజులయింది బాబి గాడు ఏదోలా ఉన్నాడు. సరిగ్గా అన్నం తినటం లేదు. ఆఫీస్ నుంచి రాగానే గదిలోకి పోతున్నాడు. ఏమిటో తండ్రిగా మీరు విషయం కనుక్కోండి అన్నారు భర్త రామారావు గారితో మీనాక్షమ్మ.!”
ఇక్కడ బాబిగాడి అనే మన్మధరావు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వయస్సు ముప్పై. ఆరేళ్ళ నుండి ఉద్యోగం చేస్తున్నాడు. టీం లీడర్ నెలకు లక్షన్నార జీతం. అతను ఏకైక సంతానం ముద్దుగా పెరిగాడు. భార్య భర్తల దృష్టిలో చిన్నవాడే. పెళ్ళి గురించి పట్టించుకోవడం లేదు కన్న తల్లితండ్రులు. తండ్రి అంటే మహా భయం. మీనాక్షమ్మ మాటలు విని భర్త అలాగే కనుకుంటాను అన్నారు.!
ఈ లోపున రామారావు గారి తల్లి ఎనభై ఏళ్ళ భారతమ్మ పూజ గదిలోంచి వచ్చి “వాడి మొహం నా కొడుక్కి ఇల్లు ఆఫీస్ తప్ప ఏమి తెలుసు. మనవడి విషయం నే కనుక్కుంటా”. అని మనవడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసి అరగంట తరువాత నవ్వుతూ వచ్చారు..!
“ఒసే మీనాక్షి నే అనుకున్నదే వాడికి ముప్పై ఏళ్ళ వయస్సు వచ్చింది. ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో జరగాలి. మీ రెప్పుడైన వాడి పెళ్ళి విషయం పట్టించుకున్నారా!” అదే విషయం నాతో చెప్పాడు. మన పక్కింటి ప్రమీల “అదేనే వాడితో పనిచేస్తుంది మనవాళ్ళే తండ్రి చిన్నప్పుడు పోయాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. చెప్పడానికి  భయపడుతున్నాడు”. “ఒరే రామం వాడికి అన్నివిధాలా తగిన అమ్మాయి డబ్బు లేకపోయినా మంచికుటుంబం. ఒప్పుకో లేకపోతే వీడికి పెళ్ళవడం కష్టం.” అని ఒరే బాబి ఇలారా! నీ పెళ్ళి ఖాయం మాఘమాసం లోనే పెళ్ళి నా మాటకు ఇక ఎవరు అడ్దు చెప్పకండి. అన్న బామ్మ భారతమ్మ కి బాబిగాడు నమస్కారం చేస్తే “శ్రీఘ్రమే కల్యాణప్రాప్తిరస్తు అని నిండు హృదయంతో దీవించారు”. దంపతులిరువురు సమస్య పరిష్కారం అయినందుకు ఆనందంతో భారతమ్మ పాదాలకు ప్రణమిల్లారు. వారిని ఆప్యాయతగా తలనిమిరిన బామ్మగారు బాబిగాడి పెళ్ళి ఘనంగా మనమే చేద్దాం రా రాముడు అన్నారు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!