పిల్లలు జాగ్రత్త
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
” పిల్లలు మీకు ఒక విషయం గురించి చెప్పాలి. అందరూ శ్రద్ధగా వినండి” అని చెప్పింది సుశీల టీచర్. “ఏంటి ? టీచర్ అది” అని ఒక అమ్మాయి అడిగింది. “చెపుతాను” అని చెప్పింది సుశీల. సరే చెప్పండి టీచర్ అని స్టూడెంట్స్ అడుగుతున్నారు. “సరే చెపుతాను అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉండండి” అని చెప్పింది సుశీల.
“సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత మాకు తెలియని వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ నాన్న నో, లేదా అమ్మ నో తీసుకొని రమ్మన్నారు అని చెప్పి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు. మీరు వెంటనే నమ్మకండి. ఎవరైనా వచ్చి ఇలా అడిగితే వాళ్ళ ఫోన్ అడిగి మీ అమ్మ వాళ్ళకి కాల్ చేయండి.
మీ అమ్మ వాళ్ళ నంబర్స్ గుర్తు పెట్టుకోండి అని ఇలాంటి జాగ్రత్తలు” చెప్పింది సుశీల.
“అలాగే టీచర్. మేము ఇక నుండి జాగ్రత్తగా ఉంటాము” అని స్టూడెంట్స్ అందరు చెప్పారు.
ఎవరైనా ఏం ఇచ్చిన తీసుకోవద్దు. మరి ముఖ్యంగా చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకోవద్దు” అని చెప్పింది సుశీల. “సరే టీచర్” అని స్టూడెంట్స్ అందరు తల ఊపారు.