ఆరోగ్యం!

అంశం: హాస్యకవిత

 ఆరోగ్యం!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

తెల్లవారకముందే లేచి,
సూర్య నమస్కారాలు చేయడంనాటి ఆచారం,
బధ్ధకంగా ఎనిమిదింటికి
లేచి, ఆదరాబాదరా కాల్స్
అటెండు అవ్వడం నేటి గ్రహచారం!
దానివల్ల ఒంటినిండా అనారోగ్యం!
భుజం నొప్పని డాక్టరు దగ్గరకు వెడితే,
ఎక్స్ రే, స్కానింగ్, బ్లడ్ టెష్టు చేసి, పదివేలు బిల్లు
వేసి, రోజూ సూర్యరశ్మిలో
ఎంతసేపుంటారన్నారు?
జుట్టుపీక్కొని, గంట
ఆలోచించి, అంతా ఏసీయే,
ఎండ నిల్లన్నాడట,
అదే జబ్బుకు కారణం,
రోజూ పదినిముషాలైన, సూర్యకాంతిలో ఉండు లేకపోతే,
రెండు లక్షల ఆపరేషన్ ఖాయమన్నాడట డాక్టర్!
అదిగో చూడండి,
పొద్దున్నే లేచి,ఎండను
ఆస్వాదిస్తున్నాడు!
ఆరోగ్యం బాగుచేసుకుంటున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!