ఆ చీకటి నుండి బయటపడిన సూర్యుడి కాంతి.

(అంశం::”ఆ చీకటి వెనకాల”)

ఆ చీకటి నుండి బయటపడిన సూర్యుడి కాంతి

రచయిత :: బండారు పుష్పలత

ఒక ఊర్లో ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు అందరిని మంచిమార్గంగా నడిపేవాడు. అతనిపేరు జ్ఞానేశ్వర్.పేరుకు తగ్గట్టుగానే అతడు మంచి జ్ఞానీ అతన్ని అందరు గురువుగారు అని ఆప్యాయంగా పిలిచేవారు. అతని ఇంటిపక్కనే ఒక పూరి గుడిసె ఉండేది. అందులో రామవ్వ,అంతయ్య అనేదంపతులు వారికీ ఒక కూతురు రమ్య అనే అమ్మాయి, వీరితో రామవ్వ తమ్ముడుఅంజి తో పాటు నలుగురు జీవనం కొనసాగించే వారు. రామవ్వ అంతయ్య కూలిపని చేసి ఇల్లు గడిపేవారు .రమ్య జ్ఞానేశ్వర్ గారు పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. తమ్ముడు అంజి తాగుడుకు బానిసగా వుండే వాడు . ఆలా అమ్మాయికి పదిహేను సంవత్సరాలు రాగానే నిగనిగా లాడే వొళ్లుతో చూడడానికి బొద్దుగా ముద్దుగా ఉండేది రమ్య. రమ్య తల్లి దండ్రులు ఒకరోజు పక్క ఊరికి భవన నిర్మాణ కూలి పనికి వెళ్లి అక్కడ ఒక ప్రమాదంలో ఇద్దరు మరణిస్తారు. ఆశవాలకి రమ్య పంతులు గారు మరియు ఊళ్ళోవారి సహాయంతో దహనక్రియలు జరిపించి ఒంటరిగా ఇంట్లో కూర్చొని రోదిస్తున్న సమయాన ఆవూరిలో వున్న కొంత మంది పోకిరిగాళ్ళు రమ్య తడికల కట్టిన బాతురూంలో స్నానము చేస్తున్నప్పుడు చాటుగా తన అందాలని చూసేవారు. ఆలా రమ్యను ఎప్పటినుండో చూస్తున్నా అపోకిరిలు ఇదే అదను అనుకోని మేనమామ అంజికి ఒళ్ళు మరిచేటట్టు తాగించిఆ అంజిని ఊగుతూవుంటే వాళ్ళు పట్టుకొని వచ్చి రమ్యవున్న ఇంట్లోకి వెళ్లి తీసుకోని వచ్చి పడుకో బెట్టి. కామముతో కన్ను మిన్ను కానక అభం, శుభంతెలియని తల్లిదండ్రులు పోయిన బాధలో వున్నా ఆ అమ్మాయి ఓరగా చూస్తూఆమెతో అసభ్యకర మాటలు మాట్లాడుతూ అమ్మాయిని ఒంటిపై చేయి వేస్తూ ఎక్కడెక్కడో తడుముతూ వుంటే ఆ అమ్మాయి బయపడి మామయ్య మామయ్య అని ఎంత అరిచినా మేన మామ క్యాలి లిలో లేకపోవడంతో అమ్మాయి జీవితాన్ని ఆచీకటిలో అన్యాయంగా బలిగొన్నారు . ఆ తరువాత ఆచీకటిలో తన స్నేహితుల సహాయంతో ఆ అమ్మయిని పట్నం తీసికు వచ్చి చీకటి సామ్రాజ్యంలో ఎంతోమంది ఆడపిల్ల బ్రతుకులు చీ కటిచేసిన కటికురాలు తాయారమ్మ కి డబ్బుకోసం తాకట్టు పెడుతాడరు ఆ మోసగాళ్లు. మేనమామా పొద్దున్నే లేవగానే కోడలి కోసం వెతకడం ప్రారంభించి ఆ పోకిరివాళ్ల దగ్గరికివెళ్లి రమ్య ఎక్కడ అని అడగగానే, మీ రమ్య పక్కవూరి వాడితో వెళ్లిపోయిందని అబద్దాలు చెప్పి మభ్య పెడతారు. అంతలో మాస్టారు వచ్చి అడిగినా అదే సమాధానం చెపుతారు ఆ దుర్మార్గులు. అప్పుడు మాస్టారుకి అనుమానం వచ్చిఅంజి తో కలిసి అరా తీయడం మొదలు పెడుతాడు ఆరోజు రాత్రి ఏంజరిగిందో గుర్తు తెచ్చుకోమని అంజిని బలవంత పెడుతాడుమాస్టారు అంజి అది గురుతు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..
***
ఆ పట్నంలో ఆనాటినుండితప్పని పరిస్తీతులలో తాయారు చెప్పినట్టు ఒళ్ళు కనబడే బట్టలు, ముఖానికి రంగువేసుకొని ఆరంగు రంగుల ప్రపంచంలో మనసులేని మనసు రాక మనసుచంపుకొని అదెలోకంగా విటులని ఆనందపరుస్తూ చీకటి మాటున తనకన్నీళ్ళని కలలనీ నవ్వులని కృత్రిమంగా మలుచుకొని లిప్స్టిక్ నవ్వులతో చీకటి లోకాన్ని అసహ్యమైన అనుభవాలని దెబ్బలని నల్లపువ్వు లుగా మలచుకొని తన నల్ల సిగలో మూడుచోకొని బాధని తననిస్సాయ స్థిస్తిని ఏమి చేయలేక తప్పదంటూశరీరం తన అధీనం లేదని తెలిసి, శరీర అలసట మనసు కుచెప్పు కొని బాదపడ్డ ప్రయోజనం లేక తన శరీరాన్ని రకరకాల సువాసనలతో నింపి శారీరక శ్రమ చేసే శ్రమజీవిగా జీవచ్చవంలా జీవిస్తూ తన రంగుల కలలజీవితాన్ని కాల రాసిన కాలాన్ని చీకటి వెనుక కోణాన్ని తలుచుకొని తనలోతానే సిగ్గు పడుతూ తన తల రాతను రాసిన బ్రహ్మ ని ఏమయ్య బ్రహ్మయ్య నాకి రూపాన్నిచ్చి నన్ను ఎందుకింత చిత్ర వద చేస్తున్నావయ్యా అని మనసులో బాధ పడుతూ ఉంటుంది. అంతలో ఊరిలో వున్న ఉపాద్యాయుడు అంజి కలసి ఆ పోకిరి గాళ్లనీ గట్టిగా బెదిరించి నిజాన్ని తెలుసుకొనేంత లోపల వీరినుండి తప్పించు కొని వాళ్ళు పారిపోతారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా పోలీసులకి వివరించిన ఏమో ఆ అమ్మాయి ఎవరితో వెళ్లి పోయిందో అని అసబ్యాం గా మాట్లాడుతారు ఎలాగైనా రమ్యని రక్షించాలని వేడుకుంన్నా పట్టించుకోరు
అంతలోపల ఆ ఉపాద్యాయుడు తన శిష్యులతో ఒక ఉపాయం అలోచించి,విటుడి వేషంలో ఆ తాయారమ్మ వున్న ఇంట్లోకి ప్రవేశించి అక్కడవున్న అడ పిల్లల దుస్థితినిచూసి ఆచీకటి కోణాన్ని చూసి వస్తున్న కన్నీటిని తన కనురెప్పల చీకట్లోకి నెట్టి తన కి ఒక యవ్వనంగవుండి తనని ఆనంద డోలికలలోతేలించు కన్యకావాలని తన మనసు చంపుకొని సిగ్గుతో తడబడే మాటలతో అడగగానే. వెంటనే తాయారమ్మ అక్కడ వున్న అతివలు అందాన్ని ఆరబోసుకొని ఉండమని పిలుస్తుంది. వారందరి లో ఆ ఉపాద్యాయుడు తలదించుకుని అమాయ కంగా నిలుచున్న రమ్య కావాలని అడగగానే. పోద్దటినుండి అదేపనిగా కుసింతయినా విశ్రాంతి లేని రమ్య దేవుడా అనుకుంటూ అతని మొకం చూడ కుండ గానే, తాను వయ్యారంగా నడుస్తూ వయ్యారాలని వలకబోస్తూ ఆఉపాధ్యాయుడి నీ గదిలోకి తీసుకెళ్లి తలుపేసి కళ్ళు మూసుకొని తన కొంగు పక్కకు నెట్టి నిలుచుంటుంది రమ్య. ఆ ఉపాద్యాయుడు తన కలలో కూడా చీకటి నిదురలో రాని ప్రదేశానికి వచ్చి నందుకు బాధ పడి కళ్ళవెంబడి కన్నీళ్లు కారుస్తూ రమ్య నేను తల్లి మీ మస్తారు జ్ఞానేశ్వర్ ని అని అనగానే రమ్య మాస్టారు కాళ్లపై పడి కన్నీళ్లతో అతని కాళ్ళు కడిగేంత లోపలనే, మాస్టారి ప్లాన్ ప్రకారం ఒక వంద మంది విద్యార్థులు ఆ చీకటి సంస్థా నాన్ని కూకటి వేళ్ళతో పేకిలించి కూల్చేస్తారు . వానర సైన్యంలా అక్కడున్న ఆడపిల్లల అందరికి విముక్తి కలిగిస్తారు. అక్కడ నుండి రమ్యని వాళ్ళఊరికి తీసుకెళ్తారు. అక్కడ తన మేన మామ తాగుడు మానేసి నా తాగుడు వలననే రమ్య జీవితం నాశనం అయ్యిందని తెలుసుకొని, రమ్యని పెళ్లి చేసుకుంటానని బుద్దిగా పని చేసుకుంటానని మాస్టారుగారి ని వెళ్లి బ్రతిమాలు తాడు. అప్పటికే రమ్యను ఒక ప్రయివేటు పాటశాలలో క్లర్కుగా ఉద్యోగం మాట్లాడు తాడు. ఇద్దరికీ పెళ్లిచేసి సంతోషంగా జీవించమని ఆశీర్వదిస్తాడు. మేనమామతో పంపిస్తాడు. రమ్య తన చీకటి బ్రతుకు వెనుకవున్న చేదును మరిచి సంతోషంగా తన వుద్యోగం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది. ఆ మాస్టరుకు చీకటి బ్రతుకులకి సూర్యుడి వెలుతురు ఇచ్చినందుకు ప్రభుత్వం సంఘసంస్కర్త గా అవార్డు ప్రదానం చేస్తుంది.
ఇది చీకటి బ్రతుకులకు సూర్య కిరణాలుపంచడం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!