ఆశ్రిత

ఆశ్రిత

రచన::సౌజన్య(చేతన)

కరుకుతనంతో నిండిన గుండె పాషాణం
చివురు ప్రాణాలపై చేసింది పెత్తనం
రాలిపడ్డ సంపెంగ పూవాసనలా ఆర్తుల గుండె నిబ్బరం ఇంకా ఆరిపోలేదు…
విగతమైన చిరునవ్వు
వికసించింది నీ రాకతో మళ్ళీ
కలల తారల వెలుగువెన్నెల కన్నీటి హృదయ రోదన ఆలకించింది..
గడుసుదనంతో పిల్లగాలులు వీచినా పచ్చని పైరుల ఆవేశాల నిట్టూర్పులు నదీ అలలా అల్లుతున్న మాలతీమాలలై అలక తీర్చింది…
గరుగు నేలల ఎదురుచూపుల సేద తీర్చి
ఆకాశం నీటి ఊటలా ఊపిరిపోసింది…
ఆవిరైన ఆశ్రువుల నీడన ఆనందం చేరవచ్చింది
ఆ ఆగమనం ఆశ్రితలా ఆదరించింది
చేతనతో చేయూతనందించింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!