నిరీక్షణ

నిరీక్షణ

రచన::సుశీల రమేష్

తొలకరి జల్లు కై చూసే పుడమిలా
తుషారం కోసం చూసే ఆమనిలా
తుమ్మెద కోసం చూసే పుష్పం లా
రవి కిరణాల కోసం ధరణి లా
వెన్నెల వెలగుకై చూసే రాత్రి లా
చల్లని శశిమామ ఎందుకు
నువ్వు రాలేదని నా మనసు
నన్ను పదే పదే అడిగిన వేళ
ఏమని చెప్పి ఊరడించను
ఎంతసేపని దానిని మభ్య పెట్టెదను
దేశసేవ లో నిమగ్నమైన నా
పతి రాకతో ,తన మోమును
గాంచిన నా మనసు మయూరము
వలె నాట్యమాడును గదా
నిన్ను నా మదిలో చేర్చుకుని
గాలి చొరబడని ఆలింగనములో
నీలో మమేకం అయ్యేందుకే
నా నిరీక్షణ…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!