అంటరాని లోకం

అంటరాని లోకం
                                 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)                   

రచన : మాధవి కాళ్ల

      అమ్మ ఎక్కడ ఉన్నావు అని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతుంది కృష్ణ. ఏం కృష్ణ ఎందుకు అలా తిరుగుతున్నావు అని పక్క ఇంటి అత్త అడిగింది..  అది అత్త అమ్మ ఇంట్లో లేదు  ఎక్కడికీ వెళ్ళింది నీకు ఏమైనా చెప్పిందా అని కృష్ణ అడిగింది.. నువ్వు వెళ్లిన తరువాత సూరిబాబు వచ్చాడు తన అప్పు ఎప్పుడు తీర్చు  లేదా నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేసి  అని అడిగాడు. సీత ( కృష్ణ వాళ్ల అమ్మ) కోపంతో నీ అప్పు తీర్చుస్తాను కానీ నాకు నువ్వే పని ఇవ్వు ఆ జీతంలో సగం నాకు మరొక సగం నీకు అని చెప్పింది దానికి సూరిబాబు ఒప్పుకొని పని ఇస్తాను తన వెంట రమ్మన్నాడు. ఆ పని కోసం మీ అమ్మ వెళ్ళింది అని చెప్పింది పక్క ఇంటి అత్త.. సరే అత్త నేను వంట చేసి కాలేజీకి తయారు అవుతాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. కాసేపు తర్వాత సీత వచ్చింది.. ఎందుకు అమ్మ సూరిబాబు కి పని అడిగావు అని కోపంతో అడిగింది కృష్ణ … నేను ట్యూషన్ చెపుతున్న కదా నీ ఆరోగ్యం బాగుండం లేదు కదా అని చెప్పింది కృష్ణ. సరే నీకు ఎన్ని సార్లు చెప్పిన విన్నావు .. వంట చేశాను తిని టాబ్లెట్స్ వేసుకో బై అని చెప్పి కాలేజీ కి వెళ్ళిపోతుంది కృష్ణ… కృష్ణ కి పది సంవత్సరాలలో తన తండ్రి చనిపోయారు ఆయన ఉన్న రోజుల్లో సీతని  కృష్ణని చాలా బాగా చూసుకున్నారు. కృష్ణ ని బాగా చదివించాలని అనుకున్నారు. సీతకి ఇష్టమైన
దేవుడు పేరు పెట్టుకుంది.. కొన్ని రోజుల తర్వాత శ్రీనివాసులు  యాక్సిడెంట్లు చనిపోయాడు ఉన్న పొలం కూడా అప్పులు తీర్చడానికి అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సీత సూరిబాబు దగ్గర అప్పు తీసుకోవాల్సి వచ్చింది.. ఆ డబ్బులతో కాలేజీలో జాయిన్ చేయించింది… ఒక రోజు కాలేజ్ కి వెళ్తున్న దారిలో సూరిబాబు  మనుషులతో కృష్ణ నువ్వు నన్ను పెళ్లి చేసుకో మీరు తీసుకున్న అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు సూరిబాబు చెప్పాడు కృష్ణ కి, కృష్ణ బాగా ఆలోచించి తన బాక్స్ సూరిబాబు కి ఇచ్చింది తినమని కృష్ణ కి నా మీద ఎంత ప్రేమ అనుకోని ఆ బాక్స్ తిన్నాడు అంతే కూరలో కారం ఎక్కువ అవడం వల్ల కారం కారం ఒకటే అరుపు కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ గీత  నవ్వుకుంటూ కాలేజ్ కి వెళ్ళిపోయారు. రోజుల తర్వాత ఆరోగ్యం బాలేదని సీతను తీసుకొని సిటీ కి వచ్చింది కృష్ణ…. సీతకి అన్ని టెస్టులు చేసిన డాక్టర్ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ఈ విషయం సీతకు చెప్పలేదు కృష్ణ. ప్రెసిడెంట్ అయిన రామయ్యను డబ్బులు అడిగింది కానీ నా దగ్గర లేవు అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం రామయ్య సూరిబాబుకు చెప్పాడు ఈ పరిస్థితుల్లో కృష్ణకు  తనని పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పాడు రామయ్య. సరే అనుకోని కొద్దిసేపు తర్వాత కృష్ణ సూరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్లింది..  సూరిబాబు నేను నిన్ను  పెళ్లి చేసుకుంటాను మా అమ్మకి ఆపరేషన్ చేయాలి దానికి రెండు లక్షలు ఖర్చవుతుంది. ఆ డబ్బులు ఇస్తే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కృష్ణ.. దానికి సూరిబాబు సరే ఒప్పుకుంటాను మన పెళ్లి ఇప్పుడే జరిగిపోవాలి రేపే మీ అమ్మకి ఆపరేషన్  అని చెప్పాడు… సరే సాయంత్రమే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి వెళ్లిపోతుంది కృష్ణ… గీత కి ఫోన్ చేసి హలో గీత అమ్మ ఇంట్లో ఉంది నువ్వు వెళ్లి అమ్మని చూసుకో  నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను. అని చెప్పి కాల్ కట్ చేసింది కృష్ణ… సీతకి  కడుపు నొప్పి వచ్చింది సడన్గా  ఆ నొప్పి ఎక్కువగా అయ్యింది.. కృష్ణకి ఫోన్ చేద్దాం అని అనుకొని  మంచం మీద నుంచి పైకి లేచినప్పుడు  కింద పడి ఆ నొప్పితో చనిపోయింది… గీత అప్పుడే వచ్చి సీతను చాలా బాధ పడింది వెంటనే కృష్ణకి ఫోన్ చేసి చెప్పింది… సరే నేను ఇప్పుడే వస్తున్న అని చెప్పి కాల్ కట్ చేసింది కృష్ణ …  సీత అంత్యక్రియలు పూర్తి చేసింది సూరిబాబుకి తగ్గిన గుణపాఠం చెప్పాలని అనుకుంది కృష్ణ.. సూరిబాబు ఆస్తి మొత్తం రాయించుకొని పోలీసులకు అప్పగించింది.. ఎందుకు అంటే తన తండ్రిని చంపించాడు అని చెప్పింది కృష్ణ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తునందుకు మా నాన్న అడిగాడు అని కోపంతో చంపించాడు అని చెప్పింది కృష్ణ. ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం.. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ అంటరాని లోకంలో బ్రతుకుంది కృష్ణ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!