ఆశ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చెరుకు శైలజ
ఆశ మనిషిని బతికిసస్తుంది
నిరాశ నిలువునా కృంగదిస్తుంది
మంచి ఆలోచనలతో వుంటు
కష్టపడి పనిచేస్తే మన ఆశలు అన్ని తీరుతాయి
ఒక వేళ అనుకున్నది
జరగకపోతే నిరాశ పడకుండ
నిలకడగా ఉండాలి.
మరల నిదానంగా నిలదొక్కుకుని
దైర్యంగా నిలబడి మరల ప్రయత్నించి సాధించాలి
ప్రతి మనిషి ఆశజీవి
ఆశతోనే జీవితాన్ని సాగిస్తాడు
మనిషి ఆశ అనేది లేకపోతే
ఏ పోటిని ఎదుర్కోలేడు
ఆశ ఉండాలి
కాని మరి అతి ఆశ ఉండరాదు.
అతి గా ఆశపడ్డ వారు
ఎప్పుడు బాగు పడరు
తనకు కావలిసిన దానికే ఆశ పడాలి.
శ్రమించి అందుకోవాలి
ఆనందం పొందాలి
అంతా నాకే అనుకోవడం
అనర్థాలకు మూలం