అన్నదాత

అన్నదాత

రచన : నాగ రమేష్ మట్టపర్తి

ఈ సృష్టి రచన చేసింది ” విధాత ”
ఆ రచనలో ఓ అద్భుత సృష్టి ” అన్నదాత ”
ఆయన శ్రమజలంతో
రంగులు దిద్దుకుంటుంది ” భూమాత ”
బంగారు పంటలతో కండపుష్టిని
అందరికీ ప్రసాదించే ఆరోగ్య ” ప్రదాత ”
పస్తులుండి అందరి ఆకలి తీర్చడంలో
ఆయనొక ” మాత, దాత ”
నిరంతరమూ దర్శనమిస్తుంది
ఆయన ఒంటిపై కేవలం చిరిగిన ” పాత ”
కష్ట-నష్టాలతో ఎప్పటికీ మారనిది
ఆయన ” తలరాత”
ఇతరుల మేలుకై తుది శ్వాస వరకూ
తన వృత్తిని వీడని ఆయనొక ” వరదాత ”

అన్నదాతకు చేయూతనిద్దాం…!
ఆయన భవిష్యత్తును తిరిగి నిర్మిద్దాం…..!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!