ఇల్లాలు

ఇల్లాలు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

నీ మనసు భావం నాకు అర్దం అయ్యింది. నా కంటికి కునుకు దూరమయ్యింది.  నన్ను ఉద్యోగం చెయ్యొద్దంటే నా కస్టం చూడలేక అనుకున్నాను. నన్ను గడప దాటి బయటకు రావద్దంటే నా పాదం కందకుండా చూసుకునే అంత ప్రేమ ఉందనుకున్నాను నేను ఫోన్ మాట్లాడుతుంటే, నువ్వు చిర్రుబుర్రు లాడుతావు ( నువ్వు మాత్రం గంట మాట్లాడతావులే) బయట నుంచి వచ్చావు విసుగు అని సరిపెట్టుకున్నా ఆనారోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని కొని తెచ్చుకున్నాను… ఇంకా నా వల్ల కాదు అంటూ అరుస్తున్నాను. ఏమి చెయ్యలేని నిస్సహాయతలో ఒక్క అరుపులే వస్తాయి. అని నాకు అప్పుడు అర్థం అయ్యింది

సందీప్ మాత్రం కనీసం మాట మాత్రం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఆలా వదలి వెళ్లలేక పోతున్నాను. నాకే ఎందుకిలా ఇంటి భాద్యత? ప్రతి స్త్రీ జీవితంలో ఇలాగే ఉంటాయా?

ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ విశ్వ ప్రయత్నం చెయ్యాలి. మళ్లీ పిల్లలు ఆకలి అంటారేమో అని గబా గబా అన్ని సిద్దం చేశాను.

గంట తర్వాత సందీప్ కూడా వచ్చాడు భోజనం సమయానికి. ఎప్పటి లాగా నేను మాట్లాడ లేక పోయాను.

ఎదుటివారి గుండెల్లో మన స్టానం ఏంటో తెలిసాక కూడా సిగ్గు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడటానికి అప్పటికే నా మనసు విరిగి పోయింది. గుండె పగిలేలా ఏడవాలని ఉంది. కానీ సిగ్గు విడిచి, దుఖం బయటకు రాను అంటోంది.

తను మాత్రం ఏమి జరగనట్టే అందరితో నవ్వుతూ మాట్లాడు తున్నాడు. మద్య మద్యలో సంద్య మంచి నీళ్లు, సంధ్య ఆ కూర మాడుతున్నట్టు ఉంది కదుపు అంటూ చెపుతున్నాడు.

ఇంట్లోని వాళ్ళు కూడా అందరూ ఎక్కడి వాళ్ళు ఆక్కడ వెళ్లి పోయారు. మేము ఎవరికి వారు సైలెంట్ గానే ఉన్నాము.

రెండు నిమిషాలలో అతను పేట్టే గురక సౌండ్ కి రూమ్ మొత్తం ప్రతి ద్వనిస్తొంది.

నా మనసు మాత్రం మూగగ రోదిస్తోంది

నన్ను ఒక్కసారీ హత్తుకో.. నా మనసు భావం నీకు అర్థం అవుతుంది. నేను కన్న కలలు నీకు తెలుస్తాయి. నా గుండెల్లోని భాద పంచుకో… అని మనసు రోదిస్తునే రోదిస్తునే రోదిస్తునే ఉంది.

నా మీద ఉన్న నిర్లక్ష్యం వైఖరి అతనికి నిద్ర పుచ్చింది.

నా మీద ఉన్న చులకన భావం అతనిని సేద తీరమంది

నేను పడే ఆ భాదలో వివరం తెలుసుకోలేని అతను విశ్రమిస్తున్నాడు

ఉదయం నుంచి పని ఒత్తిడిలో పడిన నా మనసు వేరే వారి సాన్నిధ్యాన్ని కోరుకుంటోంది.

పక్కనే ఉన్న ఫోన్ చూస్తుంటే, చాటింగులు ఆపు బుద్దిలేదు నీకు అంటూ అరచి అటు తిరిగి నిద్ర పోతున్న అతన్ని చూశాను

ఇన్నాళ్ళ జీవితంలో నా మీద ఉన్న నమ్మకం విలువ ఇదా????

కనీసం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పడం కూడా ఇష్టం లేని వాడితో ఇన్నాళ్లు కాపురం చేశానా?

నా చదువు, అందం, తెలివి ఇవేమీ అతన్ని మార్చలేక పోయాయా?

ఓడిపోయాను…. జీవితంలో ఓడిపోయాను…

కెరీర్ లో బాగుగా ఎదగలేదు, జీవితంలో కూడా ఓడిపోయాను.

ఇప్పుడు పిల్లల సంరక్షణ భాద్యతల్లో కూడా వారిని మెప్పించలేక పోయాను…

ఆలోచిస్తూ, ఒక దిండుని హృదయానికి హత్తుకుని పడుకున్నాను. రేపు ఉదయం లేవాలి. లేదా మా అందరికీ కూడా ఆలస్యం అయిపోతుంది అనుకుంటూ నిద్రపోయాను.

తెల్లవారింది.

ఇంట్లో అంతా సందడిగా ఉంది. వీళ్ళందరూ ఎప్పుడూ వచ్చారు!!!

ఎవరి మాటలో నా చెవిన పడినాయి. నా ప్రాణం రాత్రి నిద్దట్లోనే కలసి పోయిందని.

ఇప్పుడు నేను సంతోషించాలా? భాద పడాలా??? ఏమో అది దైవ రాత….

సందీప్ మాత్రం ఎప్పటి లాగానే జరగ వలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!