కడిగిన ముత్యం

కడిగిన ముత్యం

రచన::సుజాత(కోకిల)

జీవితం అనే బ్రతుకు ప్రయాణంలో ఎన్నో ఒడి దుడుకులు ఉంటాయి అవి సర్దుకుని  పోవడమే ఆడదాని జీవితం పెళ్లయ్యాక  భర్త పిల్లలు అత్తామామలు ఆడ బిడ్డలు కుటుంబంలో ఇలా అందరూ ఉంటారు ఎవరు ఒక మాట అన్న అన్నిటినీ సర్దుకుంటూ పోవాల్సిందే తాళి కట్టిన భర్తేగా  అనుకుంటు సర్దుకుని పోవాలి పిల్లలు కొపగించిన అరిచిన సరెలే మన పిల్లలేగా అని సర్దుకు పోవాలి ఇలా ఎన్నో ఆడపిల్లలు సాధించిన అత్తగారికి టిఫిన్ కొద్దిగా లేటుగా పెట్టిన కోపాన్ని సర్థకు పోవాలి ఇలా అన్ని విషయాల్లో సర్దుకుపోవాలి కద అనుకుంటూ మానస మనసులో బాధ పడింది.

కోడలా ఈరోజు పనిమనిషి రావట్లేదమ్మ ఈ రోజు అన్ని నువ్వే చూసుకో అమ్మ అంది సరేలేండి అతయ్యగారు అంది బాధగా మషికి జ్ఞానం తెలిసిన దగ్గర నుండీ  చివరి మజిలీ వరకూ అన్ని సర్దుకు పోతునే ఉండాలి ఈ బాధ సృష్టించిన ఆ దేవుడికి కూడా అర్థం కాదు ఎందుకంటే దేవుడు కూడా మగవాడే కదా ఈ రోజు కాకున్న రేపటి రోజు అయినా కరుణిస్తాడనే ఆశతో సర్దుకుపోతాము జీవితం సంతోషంగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చు కాని ఈ జీవిత పోరాటంలో గెలుపన్నది ఎప్పుడు సగం జీవితం గడిచిపోతుంది.

మానస ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగింది ప్రేమ అంటే తెలియని ప్రపంచంలో పుట్టింది అమ్మ ప్రేమ తెలియదు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది సవతి తల్లి చీదరింపులు చీర త్కారాలు మనసు లేని రాతి గుండె చేతిలో పెరిగింది తండ్రి ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయుడు భర్త ప్రేమ దొరుకుతే చాలనుకున్నాను
ఆ  ఊహల్లో బ్రతికాను వచ్చే భర్తకోసం ఎన్నోకలలు కన్నాను నన్ను ప్రేమగా చూసే భర్త కోసం రేయింబవళ్లు నిరీక్షించాను ఎదురు చూశాను నన్ను ప్రేమగా చూసే భర్త ఉంటే చాలు అనుకున్నాను.

పెళ్లి అయితే సవతి తల్లి నుండి బాధలు పోతాయని సంతోషపడ్డాను ఎంతైనా సవితి తల్లి కద అంతకు తగ్గ బొంత అన్నట్టుగా పెళ్లి చేసి చేతులు దులుపుకుంది పెళ్లయింది కదా అని ఎంతో సంతోషపడ్డాను సంతోషం ముచ్చట తీరకుండానే నేను అనుభవించిన చేదు జీవితమే శనిలా నా ముందు ప్రత్యక్షమైంది నా ఆశలు అడియాశలయ్యాయి నాపై చూపించే ప్రేమ నిజమని మురిసిపోయే అంతలోనే విధి నన్ను చిన్న చూపు
చూసింది నీకు అదే శాశ్వతం అన్నట్టుగా దేవుడు ఇంకా చిన్న చూపు చూస్తూనే వున్నాడు.

కొపతాపల్లోనెే  సంతోషం వెతుక్కుంటూ సర్దుకు.
పోతున్నాను ఇంకా ఎన్నాళ్ళు నాకీ చెరసాల నీవే నాకు నా చివరి. మజిలి .వరకూ అని. లిఖిత పూర్వకంగా నా మనస్సులో ముద్రించుకున్నాను నీ జ్ఞాపకాల గుర్తుగా ఇద్దరు పిల్లలున్నారు ఆ ఇద్దరి బంధాలు నాతో ముడిపడి ఉన్నాయి ఆశలు కోరికలు చచ్చిపోయాయి నా ముందు నా పిల్లల కర్తవ్యం గుర్తుకు వస్తుంది మనసును రాయి చేసుకున్నాను నా పిల్లలు తప్ప నాకు వేరే ప్రపంచం కనిపించడం లేదు కన్నకడుపు కద నా బాధ్యతలు నన్ను పరుగులు తీస్తున్నాయి.

ఇంకా నేను ఏమీ ఆలోచించలేదు పొట్ట చేతపట్టుకొని నాపిల్లలను తీసుకుని బయటకు వచ్చాను నా జీవిత అనుభవాలు నాకు ధైర్యాన్నిచ్చాయి నా ఆశలకు రెక్కలు తొడుగుతూ నా భవిష్యత్తుకు ఊపిరి పోస్తూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను ఒక చిన్న పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాను పెంకుటింట్లో కొత్త జీవితం మొదలు పెట్టాను అప్పుడు చదువుకున్న చదువు ఇప్పుడు పనికి వచ్చింది ఓ స్కూల్లో టీచర్గా చేరాను అదే స్కూల్లో పిల్లలను చేర్పించాను.

వెనక్కి మరలి చూడకుండా జీవితాన్ని సాగిస్తున్నాను ధైర్యంతో పిల్లలు ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్ది నాలో ఉన్న ఊపిరి రెక్కలు తొడిగాయి ఎన్నో అవమానాలను అవహేళనలను చవిచూశాను కానీ వెనక్కి తిరిగి చూడలేదు ముందుకు నడుస్తున్నాను మంచి చదువులు చదువుకొని నా చేతికి అంది వచ్చారు అమ్మంటే ఎంటో తెలుసుకున్నారు అమ్మ విలువను గుర్తించారు. నన్ను అవహేళనగా అవమానించిన వాళ్లే ఒక్కొక్కరుగా వస్తు నన్ను పొగుడుతున్నారు వాటికి నేను మురిసి పోలేదు ప్రతి మగవాడి వెనుక ఆడది ఉంటుందంటారు కానీ
నా వెనకాల అన్ని అవమానాలే అవహేళనలే అవే నా జీవితానికి స్ఫూర్తిదాయకమైనవి.

ఆడది ఒంటరిగా బ్రతక కలుగుతుందనేది నేను నిరూపించాను భర్తే జీవితమనుకుంటూ బాధలను భరిస్తూ అందులోనే కూరుకుపోవడం మూర్ఖత్వం
మనమేంటో మనం నిరూపించుకోవాలి అప్పుడే మనం పుట్టినందుకు మనం జీవించటానికి ఆశల పల్లకి అవుతుంది.మంచి చెడుల జ్ఞాపకాలను పదిలంగా నా మనసులో దాచుకున్నాను  జీవితం లో  ఏదున్న.  లేకున్నా సర్దుకుపోవడమే కాదని అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అని తెలుసుకున్నాను అదే నా పిల్లలు
నా కష్టాన్ని గుర్తించారు నా జీవితంలో కోరుకున్న సంతోషం ఇదే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!