సుందరి పెళ్ళి

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
సుందరి పెళ్ళి
రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

“అమ్మా!సుందరికి నువ్వే నచ్చచెప్పాలి.అది నీ మాటే వింటుంది .నీ దగ్గరే చిన్నప్పటినుండి చేరిక కదా.మా మాట అసలు వినడంలేదు.”తల్లికి చెప్పింది రాధమ్మ.
“ఏమంటుందే!ఇంతకి ఏం చెప్పాలి దానికి? మీరేం చెబుతున్నారో దానికి.అల్లుడసలే చండశాసనుడు కదా!అతనికి అదిలొంగటంలేదా?”రాధమ్మతల్లి శాంతమ్మ
“మీ అల్లుడుగారు మంచి సంబంధం చూశారమ్మా. అదిప్పుడే పెళ్ళిచేసుకోనని మొరాయిస్తోంది.అబ్బాయి ఓ గెజిటెడ్ ఆఫిసరు.మంచి కుటుంబం.మీ అల్లుడిగారి స్నేహితుడు నీకు తెలుసుగదా సుబ్బారావు.వాళ్ళ అబ్బాయి.దీనికేం పోయేకాలం చెప్పు.చేసుకోనంటుంది”.రాధమ్మగోల
“దానికిష్టం లేదంటుందంటే ఏమైనా ప్రేమవ్యవహారం నడుపుతుందో ఏమిటో నెమ్మదిగా రాబట్టలేకపోయావా”శాంతమ్మ సందేహం
“ఏమో నేను ఆ విషయం ఆలోచించలేదు.మీ అల్లుడుకి తెలిస్తే మా ఇద్దరి పని అయిపోతుంది.
నువ్వే దానిని ఓ దారిలోకి తేవాలి”రాధమ్మ తల్లిని బతిమాలుకుంది.
“అలాగే లే!నేను దానికి చెప్పి చూస్తాను.దానినొకసారి నా దగ్గరకు పంపించు”శాంతమ్మ భరోసా.

****

“అమ్మమ్మా!నేనొచ్చేశా!”అంటూ సుందరి అమ్మమ్మ దగ్డరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టింది.
“శీఘ్రమే కళ్యాణ ప్రా…”అని దీవించబోతున్న సుందరి పక్కనున్న అబ్బాయిని చూసి మధ్యలోనే ఆపేసింది దీవనను శాంతమ్మ.
“అమ్మమ్మా!ఈయన పేరు శివకుమార్.మేమిద్దరం ప్రేమించుకున్నాం.నువ్వే మా ఇద్దరిని ఒకటి చెయ్యాలి” సుందరి అమ్మమ్మను ప్రాధేయపడింది
“ఓసి నీ ఇల్లు బంగారం గాను.ఎంత ఘటికురాలివే.
సరే లేవండి.ఒకపక్క మీ అమ్మ ఫోనుచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకోమని నీకు నచ్చచెప్పమని ప్రాధేయపడుతోంది.నువ్విలా గుట్టుచప్పుడు కాకుండా ఇలా చేసి వచ్చేశావు”శాంతమ్మ సుందరికి మందలింపు.
“నువ్వే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్ళి చెయ్యాలి అమ్మమ్మా!నువ్వున్నావన్న ధౌర్యంతోనే మేమిద్దరం నీ దగ్గరకు వచ్ఛేశాం.మరి ఇక నువ్వే మాకు దిక్కు.
అమ్మానాన్నలను ఒప్పించుతావో ఏంచేస్తావో మరి.నీ వల్లకాదంటే మేమే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాం.మీరంతా కొన్నాళ్ళు బాధపడి ఆ తరువాత నేను మీకు లేనని ఊరుకుంటారు” సుందరి
మళ్ళి తన నిర్ణయాన్ని చెప్పేసింది.
శాంతమ్మ మనవరాలిమీద అభిమానంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసింది.కూతురు అల్లుడు కోపం తెచ్చుకున్నా పరవాలేదని నిశ్చయించుకుంది.అలా సుందరి పెళ్ళి జరిగిపోయింది.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!