ఒక్కోసారి

ఒక్కోసారి

రచన: మీసాల చినగౌరినాయుడు

ఒక్కొక్కసారి నా దరికిచేరి
గొప్ప కవనపు ఆట ఆడి
దివ్యమైన గెలుపు కవితనిచ్చి
నన్నొక అద్భుత ఆటగాడిగా నిలుపుతాయి….

ఇంకొకసారి మౌన యజ్ఞం చేస్తూ
నన్ను ఒంటరిని జేసీ
తుంటరి చేష్టలు చేస్తూ నా చుట్టూ తిరుగుతూ నన్ను వెక్కిరిస్తాయి….

ఒక్కోసారి కవన ద్వారాలు తెరిచి ఆహ్వానించినా,
ఎక్కడో దాక్కొని ఉంటూ,
నీకు ఖాళీ అయినప్పుడు
మాకు కుదరాలా? అంటూ
ప్రశ్నిస్తూ మారాంచేస్తాయి….

ఇంకోసారి తేనెటీగల గుంపులా
నా పై దాడి చేస్తూ,
మకరందాన్ని నా మస్తిష్కంలోకి
చొప్పించి,
అద్భుత భావాంకురాన్ని జ్వలింపజేస్తాయి…..

నాతో ఆడుకుంటూ
నాతో పాడుకుంటూ
నా అక్షరాలు
నను
సాహితీ సంద్రంలో బిందువును జేస్తున్నాయి
కవన వనంలో ఒక చిగురును చేస్తున్నాయి.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!