మెజీషియన్

అంశం: హాస్య కవిత

మెజీషియన్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

కాలేజీ గేట్ వద్ద కాపుకాసి కనికట్టు చేసి, రోజుకొక్క రోజ పువ్వు కానుకగా సృష్టించి ఇచ్చీ,
వెంబడించి బ్రతిమాలి మనసు దోచేశాడు, ప్రేమ ఊసులెన్నో చెప్పి పెనవేసెను బంధంతో,
మాయలోడి మాటలన్ని నీటిమీద రాతలనీ, అసలు నమ్మ రాదంటూ కన్న వాళ్ళు బ్రతిమాలిన,
ప్రేమమత్తులో మునిగిపోయి, అలకలతో పస్తులుండి పట్టు సాధించాను, ఆనందంతో మెజీషియన్కు ఆలీగా మారాను,
గుట్టలుగా పూలు తెచ్చి మురిపిస్తాడు, క్షణంలోనే మాయం చేసేస్తాడు,
కోరిన పట్టు చీరలెన్నో తెచ్చిస్తాడు, కన్నుమూసి తెరిచేలోగా అంతర్ధానం చేస్తాడు,
పండగనాడెన్నో పంచభక్ష పరమాన్నాలు తెచ్చి, ఆరగించమంటాడు, పక్కకు మళ్ళేలోగా పళ్ళెంతో సహా మాయం చేసేస్తాడు,
పుట్టినరోజు వజ్రాలనగలెన్నో తెచ్చి ఒడి నిండా పోస్తాడు, మురిపెంగా ధరించబోతే క్షణంలోన అదృశ్యం చేస్తాడు
థియేటర్ లో మంచి సినిమా చూద్దామని సరదాగా నేనడిగితే, టీవీలో కొత్త సినిమా చూపిస్తానంటాడు,
ఈ మెజీషియన్ జిమ్మిక్కులతో విసిగిపోయి,
అలకపాన్పు ఎక్కితే, ఆకలితో నకనక లాడుతు వచ్చి అన్నం పెట్ట మంటాడు,
నీ మ్యాజిక్ తో వంట చేసి నాక్కూడా పెట్టమంటే, జిత్తులన్ని మానేసి కాళ్ల బేరానికొస్తాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!