పెళ్ళెప్పుడు?

అంశం: హాస్య కవిత

పెళ్ళెప్పుడు?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మంజీత కుమార్

ఇంట్లో ఉండలేను
బయటకు వెళ్ళలేను
పెళ్ళెప్పుడంటూ పలకరింపులు
ఇక అవ్వదులే అంటూ జోకులు
నా పేరును నేనే మరచితిని
పెళ్లి కాని ప్రసాద్ కు అలవాటు పడితిని
ముప్పై దాటి మూడేళ్లు కావొచ్చే
పొట్టేమో రోజు రోజుకు ముందుకు దూసుకొచ్చే
ఫోటోలు చూసి వద్దు పొమ్మంటున్న అమ్మాయిలు
పెళ్లిచూపుల వరకూ రాని సంబంధాలు
జీతమంతా పెళ్లిళ్ల పేరయ్యలకు ధారబోసినా
ఆన్లైన్లో వెబ్సైట్స్ ను జల్లెడ పట్టినా
ఒక్క పిల్లకు కూడా నచ్చకపోతిని
పెళ్లి బెంగలో నేను మునిగివుంటే
బెండకాయ ముదిరిందని పంచులు
అంకుల్ అంటూ పిలుపులు
ఎవరేమన్నా నా ప్రయత్నం ఆపను
తాళి కట్టకుండా ఉండను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!