(అంశం: ” పెంకి పెళ్ళాం”)
తోడునీడగ
రచన :: సుజాత
నా పెళ్ళాం పెంకిదే కానీ దానిలో ప్రేమను పంచే అల్లరి పెంకి తనం ఉంది
అది పెంకిదే.కానీ నన్ను నెత్తిపై పెట్టుకునే ప్రేమ గుణం ఉంది
అది.గయ్యాలే కానీ అది లేకుంటే క్షణం కూడ ఉండను
ఎప్పుడు చిరాకుగానే ఉంటుంది కానీ పని ఒత్తిడని దానికే తెలియని పిచ్చిమాలోకం
పిల్లలు చిరాకు పడ్డ వాళ్ళు నాపిల్లలే అని అన్ని సర్దుకుపోయె గుణం ఉంది
వద్దన్న వినకుండా.నా చుట్టే తిరుగుతూ నాపై తల్లిలా ఆదరించే మనసుంది.
మేము బయటికి పోదాం అన్న వద్దంటూ ఇంట్లోనే ఉండాలంటూ గొడవ పడుతుంది..
తన పెంకి తనంతో హొటల్ తిండి వద్దట్టు ఇంట్లోనే కమ్మని రుచికరమైన వంటలు చేస్తానంటుంది.
బైయటకు వెళ్లోద్దని కరోన మహమ్మారి ఉందంటూ మాతో గొడవ పడుతుంది.
బందువులంటే వళ్ళమాలిన ప్రేమను చూపిస్తు తన పెంకి ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
తప్పనిసరి అయితే మాస్కులు పెట్టుకుని డిస్టేన్స్ పాటిస్తూ పనులు త్వరగా చాలించుకుని రమ్మని గట్టిగా చెప్పుంది.
నా పెంకి పెళ్ళాం అది కూడా ప్రేమే కదా ?