గుణపాఠం నేర్పిన బంటి

(అంశం: చందమామ కథలు)

గుణపాఠం నేర్పిన బంటి

రచన: ఎన్.ధన లక్ష్మి

విక్రమ్ తన అమ్మ, భార్య వసుంధర,కొడుకు బంటితో కలిసి జీవిస్తుంటారు.విక్రమ్ ఓ  ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటారు…

  వసుంధరకి తన అత్త అంటే అసలు పడదు..
తన భర్త,బిడ్డతో కలిసి ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు.. వాళ్ళ అత్తయ్యను తమ మధ్య అడ్డుగోడగా భావిస్తు ఉంటుంది..

బంటికి వాళ్ళ నాన్నమ్మ తో  చనువు ఎక్కువ..
ప్రతి రోజు స్కూల్ లో జరిగే విషయాన్ని నాన్నమ్మతో చెప్తుంటాడు.. వాళ్ళ నాన్నమ్మ చెప్పే  చందమామ కథలు అంటే బంటికి చాలా ఇష్టం.. అలా కథలు వింటూ నాన్నమ్మ జో కొడుతూ ఉంటే చక్కగా నిద్ర పోయే వాడు..

  ” నాన్నమ్మ నీకు తెలుసా ఈ రోజు మా తెలుగు మేడమ్ ఒక కథ చెప్పారు నాకు అయితే చాలా బాగా నచ్చింది…అదేమిటో తెలుసా!???

  ఒకసారి చంద్రుడిని,సూర్యుడిని,గాలిని,పర్వతాన్ని దేవుడు పార్టీకి పిలిచింది అంటా…వాళ్ళకి ఇష్టమైన కేక్స్ , బిస్కెట్స్ అన్నీ ఒక్కొకరికి ఒక్కో ప్లేట్ లో పెట్టీ ఇచ్చారు అంటా.సూర్యుడు,గాలి,పర్వతం అందరు వాళ్ళకి పెట్టినవి తినేశారు అంటా.. కానీ చంద్రుడు మాత్రము సగమే తిన్నారు అంటా..

  అది చూసిన దేవుడు చంద్రుడిని అడిగారు అంటా…

” ఎందుకు ఏమి నువ్వు తినలేదు అని”

అందుకు చంద్రుడు” ఇంట్లో మా అమ్మ ఏమి తిని ఉండదు..అందుకే సగం నేను తిని మిగిలినవి  మా అమ్మ కోసం తీసుకుని వెళ్తాను అని”  చెప్పాడు అంటా..

అది విన్న దేవుడు చంద్రుడికి వాళ్ళమ్మ పై గల ప్రేమను చూసి సంతోషించి ” నువ్వు ఎప్పుడు చల్లగా ఉంటావు . అందరు నిన్ను తమ మామగ భావిస్తారు అని వరం ఇచ్చారు అంటా…

తల్లి పై ప్రేమ చూపని సూర్యుడును ఎప్పుడు కాలిపోమని,పర్వతాన్ని ఒక్కే చోట ఉండమని, గాలిని అన్నీ చోట్లకి తిరగమని శాపం ఇచ్చారు అంటా..

మనం ఎప్పుడు అమ్మని చంద్రుడు లాగ  ప్రేమగా చూసుకోవాలి అని మా మేడమ్ చెప్పారు…చాలా మంచి కథ కదా  నాన్నమ్మ…

” అవును రా కన్న ! చాలా చక్కటి కథ అమ్మ,నాన్నలను మనం ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి వారి వల్లే కదా మనమంటు ఉండేది…

“వసు గుడ్ న్యూస్ నాకు ప్రమోషన్ వచ్చింది.. శాలరీ కూడా డబుల్ అయింది.నేను వచ్చే లోపు రెఢీ అయి ఉండండి మనం బయటకు అలా సరదాగా వెళ్ళి కాసేపు  గడిపి, నైట్ కి డిన్నర్ చేసి వద్దము.. నా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం”

” వావ్ ఎంత మంచి న్యూస్ చెప్పారు విక్రమ్..చాలా చాలా సంతోషంగా ఉంది.. కంగ్రాచులేషన్ అని ఫోన్ పెట్టేసి తన కొడుకు  బంటీ ని పిలిచింది ..

  నానమ్మతో మాట్లాడుతున్న బంటి ఆ పిలుపుతో బయటకు వచ్చాడు… ఏంటి అమ్మ అని ముద్దుగ అడిగాడు..

  ” రేయ్ కన్న మనం బయటకు వెళ్తున్నాము..వెళ్ళి రెఢీ అవ్వు అని చెప్పేసి తను కూడా వెళ్ళింది రెఢీ అవ్వడానికి…

బంటి నవ్వుతూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి విషయం చెప్పి రెఢీ అవ్వమని చెప్పాడు..
బంటి,వసు రెఢీ అయి ఎదురు చూస్తున్నారు…
విక్రమ్ కూడా త్వరగా ఇంటికి చేరుకుని రెఢీ అయి
సారి ఆలస్యం అయింది ఇంకా మనం బయలుదేరాదము అన్నాడు..

  నాన్న! మనం మాత్రమే నేనా!
అవును రా! ఇంకా ఎవరు ఉన్నారు…
ఉన్నారు నాన్న ఒక్క నిమిషం అంటు లోపలికి వెళ్ళి రెఢీ అయి వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్న నాన్నమ్మ ను పిలుచుకొని వచ్చాడు బంటి..
వసు ఫేస్ లో రంగులు మారాయి.. వాళ్ళ అత్తయ్యాను తీసుకువెళ్ళడం తనకు ఇష్టం లేదు..
” అత్తయ్యా !భయట వాతావరణం అంత.. బాగాలేదు.. మీ ఆరోగ్యానికి ప్రమాదం..మీరు మాతో ఎందుకు? అన్నట్టు నేను ఇంట్లో వంట కూడ చేయలేదు..ఒక పని చేయండి మన వీధి చివర ఉన్న గుడిలో ఈ రోజు రామాయణం చెపుతున్నారు..
అంతే కాదు ఈ రోజు గుడిలో మన పక్కింటి పంకజం గారి అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ ఉంది అంటా..మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది..అలాగే రామాయణము విన్నందుకు పుణ్యం ,అలాగే ఎలాగో ఫుడ్ అక్కడ తింటారు కాబట్టి మీ ఆకలి తీరుతుంది..
ఏమి అంటారు విక్రమ్…”

” అంతేగా !అంతేగా అంటు వంతు పాడాడు..”

“ప్లీజ్ అమ్మా! నేనే చెప్పాను నాన్నమ్మ కి రెఢీ అవ్వమని..ఇప్పుడు వద్దు అంటే నాన్నమ్మ బాధ పడుతుంది..”

” రేయ్ ! బంటి పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినాలి, మధ్యలో మాట్లాడకూడదు..నోరుమూసుకుని రా వెళ్దాము అంటు బలవంతంగా తీసుకొని వెళ్ళి పోయారు”

వాళ్ళు సరదాగా గడిపి నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకున్నారు..

”  బంటి నవ్వుతూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వారు.బయట ఏమి చేసారో,ఏమి తిన్నారో చెప్పి…
నాన్నమ్మ మీరు గుడికి వెళ్ళారు కదా..అక్కడ ఏమి తిని వచ్చారు అని అడిగాడు…”

” లేదు రా కన్న! నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా! నేను చిన్నగా నడుచుకొని గుడికి వేళ్లేలోపు అక్కడ అన్న ప్రసాదము అయిపోయింది..ఇంటికి వచ్చి బ్రెడ్ ముక్కలు ఉంటే తిన్నాను అని చెప్పారు నాన్నమ్మ..

బంటి ! బాధగా  బయటకు వెళ్ళాడు
అక్కడ తన అమ్మ,నాన్న నవ్వుతూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు …

“అమ్మ ! నేను పెద్దవాడిని అవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది అని అడిగాడు…”

” 12 ఏళ్ళు అలా పడతాయి కన్న…అవును ఎందుకు అడిగావు!?…”

” అదేమీ లేదు అమ్మ !నేను త్వరగా పెద్దవాడిని మీ కోసం ఇల్లు కట్టాలి కదా అందుకు”.

” చూసారా ఆండి మన బంటి మన కోసం ఇల్లు కడతారు అంటా! నా బంగారు కొండ అంటు మొహమంతా ముద్దులు పెడుతూ కన్న ఇంతకి మాకు ఎక్కడ ఇల్లు కడతావు”

” అమ్మ! గుడి పక్కన ఇల్లు కడతాను”

” ఎందుకు రా కన్న గుడి పక్కన ఇల్లు కడతాను అంటున్నావు ఆశ్చర్యంగా  విక్రమ్,వసు ఇద్దరు  అడిగారు ..

  ” మరేమో! నేను పెద్ద అయ్యాక , మీ లాగే నేను నా ఫ్యామిలి తో బయటకు వెళ్తాను.. అప్పుడు మిమ్మల్ని కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాను అచ్చం మనం ఎలా అయితే నాన్నమ్మ ను ఇంట్లోనే వదిలి పెట్టీ వెళ్ళిపోయామో ..మీరు కూడ ఫుడ్ తినడానికి గుడికి వెళ్ళాలి ..ఇల్లు దూరంగా ఉంటే మీరు వెళ్ళెలోపూ అక్కడ ఫుడ్ అయిపోతుంది..అదే దగ్గర ఉంటే మీరు ఈజీ గ వెళ్ళి తినవచ్చు కదా అంటాడు..”

” విక్రమ్,వసు కి ఎవరో చాచి కొట్టినట్టు అనిపిస్తుంది..
వాళ్ళు ఎంత తప్పు చేసారో అర్థం అయింది…ఇప్పుడు వారు  వాళ్ళ పెద్దవారి విషయంలో ఏమి చేశారో తిరిగి వారు ముసిలి వారు అయితే ఎదురయ్యేది ఇదే కదా..”

వసు,విక్రమ్ కంట కన్నీరు పరుగున వెళ్ళి పెద్దావిడను
కాలు పట్టుకొని క్షమించమని అడిగారు..

  అయ్యో! క్షమాపణ ఎందుకు…మీరు నా పిల్లలు రా మీరు ఏమీ చేసిన నా కడుపున దాచుకుంటాను
వసు పరుగున వెళ్ళి తన అత్తయ్యా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది..

విక్రమ్ ప్రేమగా తన అమ్మకు తినిపించాడు…నేను కూడా పెడతాను అత్తయ్యా అంటు వసు కూడా తినిపించింది.. నాన్నమ్మ కు నేను కూడా తినిపిస్తాను అంటూ బంటి కూడా చేరాడు..

” తమకి జ్ఞానోదయం చేసిన బంటికి వసు,విక్రమ్ ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకున్నారు”
ఈ సంఘటన తర్వాత బస్సు విక్రమ్ లో ఎంతో మార్పు వచ్చింది.. అప్పటి నుంచి వారు ఎప్పుడు బయటికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తారు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!