7వ తరగతి ప్రేమ

7వ తరగతి ప్రేమ

రచన: పద్మజ రామకృష్ణ.పి

రమ్య చూడ చక్కని పిల్ల. 7వ తరగతి చదువుతుంది.

ఇంట్లో ఎప్పుడూ రమ్యవాళ్ళ తల్లిదండ్రులు గొడవలు పడుతుండేవాళ్ళు… రాను రాను వాళ్ల గొడవలు రమ్యకి తలనొప్పిగా మారాయి.. వాళ్ళు అలా గొడవలు పడడం నెలలునెలలు మాట్లాడుకోకపోవడం.. రమ్యకి ఆ వయసులోనే అర్థం అయింది. ఇంట్లో గొడవలు తప్ప ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరూ అని.. ఇంక ఏదీ కూడా వాళ్లకు పట్టదు అనుకుంది….

పక్కింటి పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడింది రమ్య… ఇలా వాళ్ళ ప్రేమ ఎనిమిది సంవత్సరాలు సాగింది.
ఇంట్లో గొడవలు తప్ప ఏదీ పట్టించుకోని తల్లిదండ్రులు ఈ విషయం గమనించలేదు..

రమ్యకి డిగ్రీ అయిపోయే వరకు వాళ్ళ ప్రేమాయణం నడిచింది..

ఓ రోజు రమ్య ఇంట్లో నుండి వెళ్లిపోయింది…

ఉదయం వెళ్లిన రమ్య చీకటి పడుతున్న రాకపోయేసరికి కంగారు మొదలైంది. రమ్య ఇంట్లో వాళ్లకు.. ఎక్కడెక్కడో వెతికారు ఆచూకీ దొరకలేదు.. నైట్ పది గంటలు దాటుతుంది అనగా రమ్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది.

రమ్య… అమ్మ..నేను పెళ్లి చేసుకున్నాను. నాలుగు రోజుల తరువాత వస్తాను. నా గురించి వెతకవద్దు అని చెప్పి ఫోన్ పెట్టేసింది..

రమ్యవాళ్ళ అమ్మకు కాళ్ళు చేతులు వణికిపోయాయి..

ఇప్పుడు భార్యాభర్తల గొడవ మర్చిపోయి కూతురు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు భార్యాభర్తలిద్దరూ…

నాలుగు రోజుల తర్వాత పేపర్ లో వచ్చింది రమ్య విషయం…

తన తల్లిదండ్రుల నుండి తనకు.తన భర్తకు ప్రాణహాని ఉందని. అందుకే పోలీసులను ఆశ్రయించాము అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది రమ్య..

పేపర్లో వచ్చిన మరో వార్తకు బంధువులకు.స్నేహితులకు చాలా ఆశ్చర్యం కలిగించింది.. మా ప్రేమ నేను.7వ తరగతిలో ఉండగా ప్రారంభం అయింది అని రమ్య రిపోర్టులో ఇవ్వడం….

7వ తరగతిలో ప్రేమలో పడడం ఏమిటీ దాని తలకాయ. అసలు ఇలా కూడా ప్రేమిస్తారా.? అది ప్రేమేనా.? అని చాలా హాస్యంతో అందరి నోర్లు మాట్లాడుకోసాగాయి..

నిజమే కదా. అసలు ఆ వయసులో ప్రేమ పుట్టడం అంటే ఒక్కింత ఆశ్చర్యమే మరి

ఇంట్లో పిల్లల ముందు పెద్దవాళ్ళు గొడవలు పడుతుంటే. పిల్లల ఆలోచనలు ఏంటో తెలుసుకోలేక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండీ.అని రమ్య విషయం గురించి అందరూ మాట్లాడుతున్నారు….

అటు పెద్దవాళ్ళని. ఇటు పెద్దవాళ్ళని ఒప్పించి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రమ్యవాళ్ళ బంధువులు….

రిసెప్షన్ కి వచ్చిన వాళ్ళు అందరూ ఆ పెళ్లి కొడుకుని చూసి ఒక్కటే నవ్వులు.
రమ్య చక్కదనం ముందు పెళ్ళికొడుకు చాలా అందవికారం గానూ. నల్లగా.మరగుజ్జు ఆకారంలో ఉన్నాడు..

తల్లిదండ్రుల మీద కోపంతో ఇలా చేసింది అనుకోవడానికి కూడా వీల్లేకుండా ఉంది ఎదుటి వారి ఆలోచనలకు.. ఎందుకంటే ఇప్పుడు ఆ రమ్యకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు..

ఆవేశంలో పుట్టిన ప్రేమ ఏళ్ల తరబడి కొనసాగదు.. మరి ఏంటి ఇదంతా. ఇలా కూడా ప్రేమిస్తారా.?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!