యువతపై రక్కసి

యువతపై రక్కసి

రచన: బొప్పెన వెంకటేష్

మాదక ద్రవ్యాలు యువత ఆరోగ్యానికి చేటు మాదక ద్రవ్యాలు యువత వికాసానికి మాంద్యాలు మజిలీల పేరుతో యువత తప్పటడుగులు మాయల ముసుగులో మఖిలి ద్రవ్యాలు యువతపై ఉన్మోదాలు ఒక్కసారి అలవాటైతే ఎంతటి చర్యలకైనా పురిగొల్పుతుంది పున్నమినాగులా పగపడుతుంది ఆటవిక వికృత చేష్టలకు ఆలవాలం అవుతుంది అంధకారంలో అందిపుచ్చుకొని యువత బ్రతుకు బానిస చేస్తుంది మంచికి మానవత్వానికి చెడు మసి పూస్తుంది బంగారు భవిష్యత్తును బూడిద చేస్తుంది విచక్షణకు తాళం వేస్తుంది రాక్షసత్వాన్ని పరదా పరుస్తుంది అడ్డంగా చొరబడి యువత బ్రతుకులు చిద్రం చేస్తుంది యువత జీవిత లక్ష్యాలను కాటేసి కాలరాస్తుంది పైశాచికానికి ప్రాణం పోసి పిచ్చి పరుగులు పెట్టిస్తుంది చదువుసంధ్యలు చతికిల పడేస్తుంది మానవతా బంధాల విలువలను మంటగలిపేస్తుంది దళారుల దందా లను తరిమికొట్టిన నాడే చెడు సాంగత్యాలను చెరిపిన నాడే తల్లిదండ్రులు తగిన నిఘా పెట్టినాడే ఆరోగ్యకరమైన అవగాహన అందించిన నాడే మాదక ద్రవ్యాల ద్రోహాలు మాసిపోవును మరలా యువత మంచి మనుషులుగా తయారవును

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!