వృద్ధాప్యం ఓ వరమే!

వృద్ధాప్యం ఓ వరమే!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు నాగమణి

ఆహా! వృద్ధాప్యమెంతటి అదృష్టమో!
జరిగితే జ్వరమంత సుఖం లేదన్నట్లు!
తనవాళ్ళిచ్చిన మనోధైర్యంతో
శారీరక బలహీనతలను మరచి
కోరినవన్నీ అందించే అయినవాళ్ళతో
ఆడుతుపాడుతు మూడోతరంపిల్లలతో
కథలు కబుర్లు చెప్తూ కాలక్షేపణం చేస్తూ
అనుభవాలను సలహాలుగా అందజేస్తూ
పంచే మనోరంజకమైన విజ్ఞానవినోదాలతో
సమయస్ఫూర్తి, స్ఫూర్తిదాయక పనులతో
కాస్తంత నడకలాంటి వ్యాయామంతో
స్వాదిష్ఠానుసార సమగ్రపోషకాహారంతో
ధ్యానయోగాదులలో కాలం గడుపుతూ
నూతనోపకరణాలను తెలుసుకుంటూ
లభించే ఉల్లాసోత్సాహాలతో ఆరోగ్యం
ఆరోగ్యంతో పొందే  భోగభాగ్యానందాలు
చేయగలవు వారిని తృప్తితో తరించేలాగున
అలా సమకూడినపుడు వృద్ధాప్యం ఓ వరమే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!