మానసిక సౌందర్యం

మానసిక సౌందర్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లగిశెట్టి ప్రభాకర్

ఆప్యాయతలు లేని బంధాలు అందమా
అనుబంధాలు లేని జీవితాలు ఆనందమా
అక్కరకురాని చుట్టాలు అవసరమా
ఆపదలో ఆదుకోని స్నేహాలు అవసరమా
మానసిక సౌందర్యం లేని మనుగడ ఎందుకు
అంతః సౌందర్యం లేని బ్రతుకు ఎందుకు
జనులు మెచ్చే గుణ సంపన్నత కావాలి
పదిమంది నచ్చే నడత నడవాలి
మానవత్వం పరిమళాలు వెదజల్లాలి
మంచితనం సుగంధాలు పూయాలి
సభ్యత, సంస్కారం లేని సౌందర్యమేల.
రూపం, గుణం సౌందర్య విహీనం కావొచ్చు
మర్యాద అందవిహీనం కావొద్దు.
మానవత్వమే మణి మకుటం కావాలి
గుణగణాలే కవచ కుండలాలు కావాలి
మనిషి తత్వమే పదిమంది మేలు కోరాలి
అప్పుడు..అంతః సౌందర్యమే అందలమెక్కుతుంది
అందరిలో విజేతగా నిలిపుతుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!