శుభ కృతి పురస్కారము

శుభ కృతి పురస్కారము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

         సూర్య ఉదయంలో కరగ్రే వసతే లక్ష్మి అంటూ ఎన్నో స్తోత్రాలు నేర్పింది బామ్మ . బామ్మ ఆరోజుల్లోనే డీ వై. ఈ. ఓ చేసి రిటైర్ అయ్యింది. తాతగారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు బామ్మ తాత గారు కన్న పెద్ద ఉద్యోగం  చేసింది కొంచెం పొలం కూడా ఉన్నది. స్త్రీ కి విద్య ఉండాలి అని తాతగారు బామ్మ అక్క చెల్లెళ్ల ను చదివించారు. నాన్నను వాళ్ళ నాన్న గారు  మగ పిల్లలు లేక పోవడం వల్ల దత్తత పుచ్చుకున్నారు అయిన సరే అస్తి నాలుగు భాగాలు చేసి పంచారు అందరూ సంతోషించారు కూడా బామ్మ పూర్ణ  చదువు పెద్ద చదువు చదివించి ఉద్యోగంలో చేరి పరీక్షలు కట్టి పాసయ్యి పెద్ద ఉద్యోగం చేసింది. తాత రావు గారు ఎప్పుడు ఎది వద్దు, అనలేదు  కారణం బామ్మ అన్ని తాత గారికి చెప్పి చేసేది ఆయన అంతేగా మరి మంచి పని అని అనేవారు వంట వార్పు శుచి శుభ్రము మడి ఆచారం అన్ని పాటించాలి అని చెపుతుంది.
అటువంటి సంప్రదాయం లో మనవడిగా యశోధర రావు పుట్టాడు. పెరుగు దల చదువు అన్ని కూడా ర్యాంక్ లతో జరిగింది. వాడు విదేశాలు వెడతాడు అని జాతకం లో ఉన్నది తప్పదు కదా తాత గారు హెచ్ ఎమ్ గా పదవీ విరమణ అయ్యేక జ్యోతిష్యము నేర్చుకుని దానిపై పరిశోధన మాదిరిగా చేసి జాతక దోషాలకు నివృత్తి చూపి ఎవరైనా అడిగితే ఉచితంగా చెప్పేవారు ఎక్కువ భాగం ఆయన పేపర్స్ కి రాసేవారు ప్రశ్న జవాబులు చెపుతూ ఉండేవారు. ఆయన ప్రజ్ఞ తెలిసి ఛానెల్ వారు కూడా అవకాశం ఇచ్చారు ఆలా ఆరంగంలో ఉన్నతుడుగా ఉగాది పురస్కారానికి ఈ సంవత్సరం ఎంపిక అయ్యి అన్ని పత్రికలూ ఆన్లైన్ పత్రికలలో ఇంటర్వ్యూస్ ఘనంగా వచ్చాయి. పండుగ రోజు కి ముందు రోజు ఇల్లంతా శుభ్రంగా కరిగించి రంగు ముగ్గులు పెట్టించారు. ఇల్లంతా తోరణములతో అలంకరించారు. నాన్నకి పిన్నిలు కూడా అక్కల వరుస అవుతారు అందుకని అందరూ బంధువులు అందరూ వచ్చారు. ముందురోజు కొత్త బట్టలు అందరికీ పెట్టీ తెల్ల వార గట్ల లేచి పచ్చడి ఇడ్లీలు తిని ఆనందంగా అంతా కలిసి రెండు సుమొలలో అమరావతి లో జరిగే ఉగాది ఉస్స్థవానికి బయలుదేరి వెళ్లారు. మాస్టారి కుటుంబం బంధుమిత్రులతో వచ్చినందుకు అంతా అక్కడివారు ఆనంద పడ్డారు. మీడియా వాళ్ళు అంతా కూడా వచ్చి ఈ రోజుల్లో ఇలా ఉమ్మడి కుటుంబం వింతగా ఉన్నది అంటూ ఎన్నో ప్రశ్నలు వేసి బాగా కలిసి ఉండటానికి కారణం చెప్పమని అడిగారు. దానికి తాతగారు రావు గారు నవ్వి ఏముంది మనం ఇంటి యజమాని గా ఆంక్షలు పెట్ట కుండా ఆకాంక్షలు నేర వెరుస్తు ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తు, ప్రేమగా చూస్తే ఎందుకు గొడవలు వస్తాయి. సరి అయిన ప్రేమ చూపక ప్రతి పనికి వంక పెడుతూ పిల్లలను భార్యను వెదిస్తు ఉంటే కుటుంబాలు నిలబడవు.
ఇప్పుడు ఇద్దరు చదువు కున్నవారే కానీ భార్యలను విమర్శించే వ్యక్తులు ఎక్కవ  కారణం తమ కొడుకు పెళ్ళాం వెంట వెళ్లి పోతాడు అని భయం ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అందుకే గొడవలు వస్తున్నాయి.
పెద్ద వాళ్ళు ఎంత వరకు అంతా వరకే ఎవరికి చ్చే గౌరవం వారిది అని తెలుసుకోవాలి. మా అమ్మ పెద్దది అవిడ చెప్పినట్లు నువ్వు మడి గట్టి వండాలి అంటూ ఇంకా వస్త్ర ధారణ దగ్గర నుంచి పంజాబీ వద్దు సిల్క్ చీర వద్దు అనే మనుష్యులు ఉన్నారు దానికి కారణం కోడలు పై ఈర్ష్య తన పిల్లలు కన్న ఎక్కవ  సుఖపడకూడదు ఆ ఇంట్లో అత్త పెత్తనం చెల్లాలి అని భావన వల్లే వస్తాయి. అని చెప్పి నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. చక్కగా ప్రశంసల మధ్య అవార్డ్ తీసుకున్నారు. మనవడు యశొధర రావు చాలా గర్వ పడ్డాడు ఇంత మంచి కుటుంబంలో తను పుట్టాడు. వంశం పేరుకి తను వారసుడు పెద్దల కోసం అంతా ఎంతో బాగా అభిమానం పెంచుకుని సుఖంగా జీవిస్తున్నారు తను వాళ్ళకి అండగా ఉండాలి. విదేశాలకు వెళ్లందుకు అవకాశం వచ్చిన ఆలోచించాలి అనుకున్నాడు. ఉగాది పండుగకు కూడా యువ తలో మెరిట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
చిత్ర లేఖనంలో వనజ అనే అమ్మాయికి ఇచ్చారు అధి చూసి రావు కుటుంబం ముచ్చట పడ్డారు.
అలాంటి పిల్ల మన యశోదర్ కి భార్య అయితే బాగుండును అనుకున్నారు. ఆ అమ్మాయి రవీంద్ర నాథ్ టాగూర్ గారు శాంతి నికేతన్ లో చదివింది.
చాలా ప్రశాంత వదనము ముఖం ఎంతో కళగా ఉంది. పసిమి రంగు ముఖము అందుకు తగ్గట్టుగా పాదాలకి పసుపు రాసుకున్నది. పట్టిలు ముక్కు పుడక బుట్టలోలకులు మెడలో చిన్న గొలుసు ఉన్నాయి కలకారీ ప్యూర్ పట్టు చీర దానికి అద్దాల అంచు వేసిన చీర కట్టుకుని జారీ వర్క్ అద్దాలు ఉన్న జాకెట్ వేసుకున్నది. పెద్ద జడ కావడంతో కట్టిన మల్లె కనకాంబరం మరువం దండ పొడుకు బొట్టు పెట్టుకున్నది. చాలా అందంగా కావ్యాలలో రచించిన కన్య లా ఉన్నది. రావు గారు చాలా ముచ్చట పడ్డారు అదే మాట మనసులో పలు మార్లు అనుకున్నారు. స్టేజ్ దిగి వచ్చాక ఆమె సీట్లో కూర్చున్నాక వెతికారు. ఆ అమ్మాయి ఒక్కతే వచ్చి నట్లు ఉన్నది అయితే ఏమి వివరాలు కనుక్కో వాలని అడిగారు. అక్కడ ఫంక్షన్ అయ్యాక కారు దగ్గరకు వస్తుంటే ఆమె కూడా పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తోంది. గబ గబ రావు గారు పుర్ణను వెళ్లి వివరాలు తెలుసుకో మన్నారు. పూర్ణ వెళ్లి అభినందనలు ఆశీస్సులు చిన్న వయస్సులో పురస్కారం ప్రభుత్వం నుంచి పొందావు అని ప్రశంసా పూర్వకంగా అన్నారు. నమస్తే అమ్మమ్మ గారు మీ లాంటి పెద్దల దీవెనలు వల్ల వచ్చింది అని చెప్పింది. మీకోసం ఎవరైనా వచ్చారా? వస్తారా? లేదండీ నేను కలకత్తా నుంచి వచ్చాను
నేను హాస్టల్లో ఉంటాను. మా అమ్మ నాన్న సింగపూర్లో ఉంటారు. నాకు ఇండియన్ కల్చర్ కళలు అంటే ఇష్టం నేను మాత్రం ఇక్కడ చదువు తున్నాను. ఎమ్ ఏ ఎఫ్ చేస్తున్నాను అని చెప్పింది
అయితే మాతో పాటు వాస్తవ అమ్మ అన్నారు లేదు విమానం టికెట్ బుక్ చేసుకున్నాను సాయంత్రం నాలుగుకి  ముందే వెళ్ళాలి ఇప్పుడే రెండు అయ్యింది  కాబ్ మాట్లాడుకుని  వెళ్లి పోతాను అన్నది. పర్వాలేదు మేము అటే వెళ్ళాలి మా కార్లో దింపుతాము అన్నది. కానీ ముందు ఆలోచించింది మీరు ఇప్పుడే పరిచయము కదా అన్నది. పర్వాలేదు నేను పెద్ద దాన్ని చెపుతున్నాను తెలియని కాబ్ ఎక్కే కన్న మాతో రావచ్చును అని చెప్పింది. సరే అని వనజ కారు ఎక్కింది. ఇవి అవి కబురులు చెపుతూ ఓ కొబ్బరి బొండాల కొట్టు దగ్గర ఆగి అంతా బొండాలు తాగారు, మాటల్లో కుటుంబ విషయాలు తెలుసుకున్నారు. ఒక అన్నగారు అతను డాక్టర్ బెంగాలీ అమ్మాయిని చేసుకున్నాడు.
అమ్మ నాన్న మొదట బాధ పడ్డారు తరువాత నువ్వు ఇలాంటి పని మాత్రం చెయ్యకు మీకు నచ్చిన స్వేచ్ఛ ఇచ్చాము కదా అని ఆడపిల్లని నువ్వు మాత్రం చేసుకోకు అని చెప్పారు అని కూడా చెప్పింది. నీకు దగ్గర సంబంధాలు ఉన్నాయా అన్నారు లేదు అని చెప్పింది. హమ్మయ్య అని తల్లి తండ్రి అడ్రెస్స్ పుచ్చుకున్నారు. విమానాశ్రయం లో వదలి వెళ్లి ఇంటికి చేరారు. మర్నాడు ఆ పిల్ల జాగ్రత్తగా చేరినట్లు మెసేజ్ పెట్టింది. పర్వాలేదు పెద్దలు అంటే గౌరవం ఉంది అనుకున్నారు.
మీ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పారు. ఆ తరువాత రెండు రోజులకు అన్ని మాటలాడుకోని వాళ్ళ తల్లి తండ్రికి ఫోన్ చేశారు.
విషయం తెలుసుకుని సంతోషింఛారు మేము వస్తాము వెచ్చే నెలలో అన్నారు. సరే అంటూ అంతా సంతోష పడ్డారు. బావగారు ఫంక్షన్ కొచ్చిన బంధువులు అంతా త్వర లోనే యశోదర్ పెళ్ళిలో కలుద్దాము అనుకున్నారు. విదేశాల మనం పంపక పోయినా విదేశీ అత్తగారు వచ్చారు మన మనవడికి అని సంతోష పడ్డారు. ఎన్ని రోజులు ఎదురు చూసి విదేశాలకు వెడతారు కానీ దీనికి భిన్నంగా మనవడు చాలా సార్లు విదేశీ యానం వద్దు అనుకున్నాడు కానీ జాతకంలో ఉన్నది కదా  అందుకే విదేశీ సంబంధం వచ్చింది అనుకున్నారు. మాఘ మాసంలో ఘనంగా ఇండియా వచ్చి పెళ్లి చేసి విదేశాల్లో రిసెప్షన్ ఇచ్చారు.  పిడిి కిట తలంబ్రాల పెళ్లి కూతురు గట్టి మేళం వారు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి  కీర్తన  వాయించారు.
ఎక్కడి కక్కద ఘనం గా ఏర్పాట్లు అన్ని తాత గారే వారి ఊరిలో చేశారు. జాతకం లో విదేశీ యోగం మన అందరికీ ఒకే సారి వచ్చింది అనుకున్నారు.
కన్న తల్లి జన్మ భూమి మరువకూడదు. ఏ దేశం వెళ్ళినా మన సంస్కృతి సంప్రదాయం మరువ కూడదు. పిల్లలు పెద్దల కి గౌరవం ఇచ్చి కుటుంబ భక్తి దేశ భక్తి ఉన్నపుడే ఉన్నత కీర్తి ఇదే నమ్మకంతో ప్రగతి సాధించాలి. మనవడితో పాటు ఇంటిల్లి పాదికీ సింగపూర్ చూసే యోగం ఉన్నది అమ్మ ప్రేమ జన్మ భూమి రెండు మనుష్యులు ఉన్నతి కొరుతాయి
పిల్లలు కూడా పెద్దలకి గౌరవం ఇవ్వాలి, ఎన్నో దేశాలు వెళ్ళిన మన సంస్కృతి సంప్రదాయాలు భక్తి  ఆదరణ ముఖ్యము. జీవితం ఒక నమ్మకము
ఏ దేశ మేగినా ఎందు జీవించిన పొగడాలి మన తల్లి భారతినీ, మన జాతి గౌరవం, కీర్తి పెంచాలి శాంతి శుభము.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!