(అంశం : నా అల్లరి నేస్తం) ఆత్మీయ నేస్తం
రచన :: శాంతి కృష్ణ
అలిగిన వేళ
అమ్మవై బుజ్జగిస్తావు
ఆట పాటలలో
సోదరుడివై తోడుంటావు
కష్ట సమయంలో
స్నేహితుడివవుతావు
సంక్లిష్ట సమయంలో
తండ్రివై అండగా ఉంటావు
అన్ని వేళల్లో
అరమరికలు లేక
నను నీ అల్లరితో అలరించే
నా అల్లరి నేస్తానివి నువ్వు
అన్ని బంధాలను మించి
జీవితకాలం తోడుండి
నను ప్రేమతో సాకే
ఆత్మీయ బంధానివి నువ్వు