(అంశం : నా అల్లరి నేస్తం) వాలుజడ
రచన :: నాగమయూరి
అతివల అందానికి తలమానికమైన నా నెచ్చెలి
అనుక్షణం నను కవ్విస్తూ తోడుగా నిలుస్తుంది
తనని పట్టించుకోకుంటే నా మోముని చిందర వందర చేస్తుంది
లాలనగా తనని తీర్చిదిద్దినంతనే నా అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది
పుష్పములన్న బహుప్రీతి తనకి
మల్లెలయితే మరింత మక్కువగా తనదరి చేర్చుకుంటుంది
జచకుచ్చులతో ఓలలాడించు వేళ తన మురిపెము, వయ్యారముతో చూపరులను కట్టిపడేసే నెరజాణ
లయాత్మకంగా కదులుతూ
నా నడకకు సొబగులద్దే సుందరి
నా మునివేళ్ళతో బంధించి ముడిపెట్టినా అలగక, మరింత ప్రేమగా నన్ను హత్తుకుంటుంది
నాకు నచ్చిన ఆ అందాల నెచ్చెలి ఎవరో తెలుసా?
నా ప్రియమైన అల్లరి నేస్తం నా వాలుజడ.