కవిరాజు

కవిరాజు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

కాంభోజరాజు ఆస్థానంలో అనేక మంది కవులను పోషించేవాడు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన కవులు గా ఉంటున్నారు. అలాంటి వారిలో “తుంబురుడు”అనే కవి వాడొకడున్నాడు. తుంబురుడి తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప గాప్ప కవులు కాంభోజరాజు ఆస్థానంలో ఉండిన వారే. అయితే తుంబురుడు మటుకు కేవలం కవి–అంటే వట్టి శుంఠ, ఏళ్ళ తరబడి వినటం వల్ల అతనికి వెలకొద్దీ శ్లోకాలు, పద్యాలు, కంఠత వచ్చుగాని కొంచమైనా లోక జ్ఞానం లేదు పరమ మూడుడు. ఈ సంగతి రాజుకు తెలియదు. అయితే ఆస్థానంలో ఉండే కవులందరూ తుంబురుని విషయం సులువుగా కనిపెట్టారు. అటువంటి మూడుడుకి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏమాత్రము సమ్మతం కాలేదు, అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి, “మహాప్రభో”! తుంబురుడు లోకజ్ఞానం లేని వెర్రివాడు అతనికి ఆస్థానపదవి ఇవ్వటం ఆస్థానానికే అప్రతిష్ట అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడండి” అన్నాడు కవులందరూ! కాంభోజరాజు ఆశ్చర్యపోయయాడు. ఎందుకంటే తుంబురుని తండ్రి కవి దిగ్గజం అతను చనిపోగానే ఆస్థానం తుంబురునకు దక్కింది వారి తండ్రిగారు వలనే విభూతి రేఖలు, శాలువ, కర్ణకుండలాలూ ధరించి తుంబురుడు చూడటానికి “కవిరాజు” వారి తండ్రిగారులా ఉంటాడు. ఐనా మీరు చెప్పినట్టగానే పరీక్షించుదామని రాజుగారు ఒకరోజు సభలోతంబురున్ని యిలా అడిగాడు. కవిమహాసయా తుంబుర! కొందరు మనుషులు పావురాళ్ళ ను పట్టుకుంటుండగా చూశాను. వారికి పావురాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు అని అడిగాడు రాజు. అది విని తుంబరుడు “మహారాజా పావురాయి పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బోచ్చుతో చలికి కప్పుకొనే శాలువాలు చేస్తారు” అన్నాడు తడుముకొకుండా! రాజుకు ఆశ్చర్యం వేసింది. కాని సభలో కొందరు నవ్వారు. తుంబురుడు మూడుడని తేలిపోయింది. రాజు మరొక సారి ఈ విధంగా అడిగాడు.
కవిరాజా తుంబుర! నేనోక విడ్డూరమైన వార్త విన్నాను. కోడిపుంజులు, గర్జిస్తూ కొండచిలువ మీదకి దూకుతాయట ఇది నిజమై వుండ వచ్చునా! “అందులో విడ్డూరం ఏమి లేదు మహారాజా! కొండచిలువ కోడిపుంజులకు సహజమైన ఆహారమే కోడిపుంజు కొండచిలువ మీదకి ఉరికి దాని తలపై ఉన్న కుంభస్థలం ముక్కుతో చీల్చి తింటుందిని శాస్త్రలలో చెప్పి ఉన్నది.” అన్నాడు తుంబురుడు.
ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వాడు. రాజుగారు కూడా పగలపడి నవ్వు కొన్నారు. “అయితే కవి మహాసయా నేనొకసారి తగలబడుతున్న సరస్సు చూశాను. ఆ సరస్సులో నాకు కప్పలు గాని, చేపలు గాని కనిపించలేదు. కారణం ఏమై ఉంటుందని మరోక సందేహం అడిగాడు రాజు. “సరస్సు తగలబడుతున్నది గదా! అందుచేత సరస్సులోని కప్పలు, చెపలు ఒడ్డుకు వచ్చి సమీపానగల తాటిచెట్లలపైకి ఎక్కి ఉంటాయి!అన్నాడు తుంబురుడు. ఇంకేముంది సభలో మొత్తం నవ్వులే నవ్వులు. “తమరే చూశారు గదా! మహారాజా! ఈ మూడున్ని తక్షణమే ఆస్థానం నుంచి పంపి వేయండి అన్నారుఆస్థాన కవులు రాజుతో. “ఇంత హాస్యం పుట్టించగల వాన్ని ఆస్థానం నుంచి వెళ్ళ గోట్టటం మాకు ఇష్టం లేదు. నేటి నుంచి “తుంబురుడు మన ఆస్థాన “కవిరాజు” విదూషకుడు”గా నియమిస్తున్నాం! అన్నాడు కాంభోజరాజు. సభ అంతా కవిరాజు తుంబురునికి జై అంటూ జై కొట్టారు ఆస్థాన కవులతో సహ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!