మార్పు

మార్పు

– శ్రీదేవి విన్నకోట

“చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
నీకేం కాదని,నిన్నటి రాతనే మార్చేస్తానని”
టీవీలో వస్తున్న మంచి పాటని ఆసక్తిగా చూస్తూ
నిలబడిపోయిన నన్ను ఏం వంటింట్లో
ఏం పని పాటు లేదా అలా మొద్దు రాచిప్పలా అక్కడే  నిలబడి పోయావు. పో పోయి వంట ఏర్పాట్లు చూడు.
సుజన పెరుగు వడలు వేయమంది వేస్తున్నావా అంటూ గయ్యిమన్న అత్తగారితో వెళ్తున్న అత్తయ్య అంటూ వంటింట్లోకి నడిచాను నేను.

ఆ పాటలో విన్నట్టుగా నా జీవితం లోకి వెలుగు ఎప్పుడొస్తుందో, ఎప్పటికీ తనకి అత్తగారు ఆడపడుచు ఆరళ్ళు తగ్గుతాయో అనుకుంటూ పరధ్యానంగా ఉల్లిపాయలు కోస్తు నా చేయి కూడా కోరుకున్నాను
బాగా లోతుగా తెగడంతో రక్తం వస్తున్న చేతిని
సింక్ లో నీళ్ల పైపు కింద పెట్టాను. ధారగా పడుతున్న నీళ్లు లాగే నా ఆలోచనలు కొనసాగుతున్నాయి.

నా పేరు గాయత్రి మధ్యతరగతికి కంటే కాస్త దిగువతరగతికి చెందిందే తన పుట్టిల్లు. తండ్రి కట్నం ఎక్కువ ఇచ్చుకోలేక అందరూ తన అత్తగారు శాంతమ్మ. పేరుకు మాత్రమే ఆమె శాంతం గానీ
ఆవిడ తత్వం గయ్యాళి అని, నీ పిల్లని చేసుకుంటే రాచిరంపాన పెడుతుంది అని ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు అందరూ చెప్తున్నా సరే వినకుండా తండ్రి విళ్ళకే అంటకట్టాడు తనని.

అలా గయ్యాళి అత్తగారు ఉన్న ఇంట్లో తననీ ఇచ్చి పెళ్లి చేసినందుకు మొదట్లో తండ్రి మీద కోపగించుకున్న తన తర్వాత ఇంకో చెల్లికి పెళ్ళి చేయాల్సి ఉంది. తమ్ముడు ఏమో చిన్న వాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు.

మళ్లీ వాడికో దారి చూడాలిగా అని ఆలోచించి తనే అర్థం చేసుకుని  అత్త ఆడబడుచు ఎన్ని అన్నా సర్దుకుపోతూ  తనలో తానే బాధపడుతూ అలాగే ఉంది. ఇందులో కాస్త మంచి విషయం ఏమిటి అంటే భర్త గౌతమ్ అతను చాలా మంచివాడు తనని బాగా అర్థం చేసుకున్నాడు

గౌతం ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు.  అతని కోసం ఎంత కష్టమైనా భరించాలి అనిపిస్తోంది. అందుకే అత్తగారు, ఆడపడుచు సుజనా ఎన్ని అన్నా మౌనమే నా మూగ భాష అంటూ నెట్టుకు వచ్చేస్తోంది అలా కాలాన్ని.

ఇప్పుడు సమయం ఆరు కావస్తోంది. గౌతం వచ్చే టైం అయిపోయింది. తనకి ఇంకా వంట ఇంట్లో పని కాలేదు.అతను రాగానే చక్కగా తయారై చిరునవ్వుతో అతన్ని పలకరిస్తూ తినడానికి ఏమైనా పెట్టీ టీ కప్పుతో అతని పక్కన చేరి సంతోషంగా బోల్డన్ని కబుర్లు చెప్పుకోవాలని లేదా సరదాగా ఎటైనా తిరిగి రావాలని ఉంటుంది.

కానీ  అలా కుదరదు అత్తగారు పురమాయించే పనులతో రాత్రి తొమ్మిది  గంటల వరకు ఇంటి పని చేయాల్సి వస్తుంది. ఒకవేళ పని అయిపోయిన అత్తగారు మరో కొత్త పని సృష్టించి మరి చెప్తుంది.
తను తన భర్తతో సంతోషంగా ఉంటే అత్తగారు చూడలేదేమో  అనిపిస్తోంది తనకి. ఇంతలో తాను అనుకున్నట్టే భర్త గౌతం వచ్చాడు. పిండి కలుపుతున్న చేతులతోనే మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్లి ఇచ్చింది.

పనిచేస్తూ జిడ్డోడుతున్న  మొహం తొ ఉన్న నన్ను చూడగానే అతని కళ్ళలో బాధ,నిరాశ కానీ అతను ఏమీ మాట్లాడలేదు మంచి నీళ్ళు తిసుకుని  బెడ్
రూం లోకి వెళ్ళిపోయాడు. అతను ఎందుకో
కోపంగా ఉన్నట్టు అనిపించింది నాకు.

మర్నాడు ఉదయమే గౌతమ్ ఈ రోజు సెలవు పెట్టాను గాయత్రి. అమ్మని ఓ చోటికి తీసుకెళ్లాలి. అనేసరికి
ఎక్కడికి అని అడగబోయి ఆయనే చెప్తారు కదా అడగడం ఎందుకు అని ఊరుకున్నాను.

అంతలో మా అత్తగారు బయటకు వచ్చారు.తన రూమ్ నుంచి, ఏం నాయనా  ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళవా, పెళ్ళాం తో ముచ్చట్లు ఆడుతూ కూర్చున్నావు అని వెటకారంగా అంటున్న తల్లితో అమ్మ నీతో మాట్లాడాలి. ఓ పది నిమిషాలు ఇక్కడ కూర్చుంటే మాట్లాడుతాను, అన్న గౌతమ్ తో దానికేం భాగ్యం పది నిమిషాలు కాదు నువ్వు పది గంటలు కూర్చో మన్న కూర్చుంటా అంటూ అక్కడే సోఫాలో కూలబడి ఏమే
పోయి కాఫీ తీసుకురావచ్చు కదే, ఆలా గుడ్లు అప్పగించి చూడకపోతే అని తిట్ల దండకం అందుకోవడం తో నేను ఇక వంటింట్లోకి నడిచాను.

చెప్పు గౌతమ్ ఏంటో అంటున్న తల్లితో చెప్పడానికి వచ్చాను అమ్మ.చూడమ్మా నాకు మా కంపెనీ తరఫునుంచే  ఢిల్లీలో పని చేయడానికి మంచి ఆఫర్ వచ్చింది. అది మూడు సంవత్సరాల కాంట్రాక్ట్  ఇప్పటికన్నా జీతం రెట్టింపు వస్తుంది అని చెప్పగానే పొద్దున్నే చాలా మంచి విషయం చెప్పావు.

మరి నీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది శాంతమ్మ
ఓ పదిహేను రోజుల్లో వెళ్లాల్సి ఉండొచ్చు. నేను నాతో పాటు గాయత్రిని తీసుకెళ్తాను. నేను ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను. నిన్న బావ తో మాట్లాడాను సుజన బుద్ధిగా ఉంటే రెండు రోజుల్లో వచ్చి తనని తీసుకెళ్తాను అన్నాడు బావ,

అయినా దాని పెళ్లి అయ్యి ఆరు ఏళ్ళు అయ్యింది. అలా చీటికిమాటికి భర్త అత్తగారితో పోట్లాడి ఇలా పుట్టింటికి వచ్చేస్తే ఎలా అమ్మ, తన కంటే చిన్నది కనీసం మీ కోడలు గాయత్రిని చూసైనా బుద్ధి తెచ్చుకోవచ్చుగా తాను ఎంత నెమ్మదిగా పద్ధతిగా ఉంటుందో. చెల్లి ఇంకెప్పటికీ నేర్చుకుంటుంది మంచి మర్యాద చెప్పు అని విసుగ్గా అంటూ

ఏలాంటి పిచ్చి వేషాలు వేయకుండా పద్ధతి గా ఉండమని సుజన కి నువ్వే నచ్చచెప్పమ్మా అన్నాడు గౌతం, చాల్లే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు అంట అలా ఉంది నువ్వు చెప్పేది. చాలా బాగుందిరా నీ మట్టుకు నువ్వే నిర్ణయాలు తీసుకుని నాకు చెప్పేంత పెద్ద వాడివి అయిపోయావు.ఇవన్నీ నీకు నీ పెళ్ళాం బాగానే నూరి పోస్తుందే. పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా ఉంటుంది. అంటూ(ఈ మాటలన్నీ నాకు వంటగదిలోకి వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఏమీ అనలేని నిస్సహాయత నేను అలాంటి దాన్ని కాదు అని అత్తయ్య నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో
ఏంటో అని నా మనసులోనే అనుకున్నాను)

నీ చెల్లెల్ని కాపురానికి పంపించేసి నువ్వునీ పెళ్ళాన్ని తీసుకు ఊరేగిపోతే ఇక్కడ నేనేం చేయాలి ఒంటరిగా? నేను మీతో పాటే వచ్చేస్తా అంటున్న తల్లిని ఆపుతూ వద్దమ్మా నేను ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను అని అంటూ బ్యాగ్లోనుంచి గురించి కొన్ని కాగితాలు బయటికి తీశాడు గౌతం.

ఇవి మదర్ తెరిస్సా అనే వృద్ధాశ్రమం నుంచి తీసుకు వచ్చాను. నిన్ను అందులో చేర్పించడానికి నేను నిర్ణయించుకున్నాను. నువ్వు అక్కడ ప్రశాంతంగా హాయిగా  ఉండొచ్చు. నెలకి ఇంత అని డబ్బులు కడితే సరిపోతుంది.

కాబట్టి నీకు కావాల్సిన బట్టలు, వస్తువులు అన్ని  సర్దుకో అమ్మ మేం వెళ్లే ముందే నిన్ను అందులో చేర్పించి వెళ్తాము. ఆరు నెలలకు ఒకసారి వచ్చి చూస్తాము అని చెప్తున్న కొడుకుతో నోట మాట రాక
ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటూ కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటే గౌతమ్ వంకే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది శాంతమ్మ.

ఇంతలో వంటింట్లోంచి ఇదంతా వింటున్న నేను ఇక ఆగ లేక పోయాను, ఏంటండీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్ధం అవుతుందా. అత్తయ్యని వృద్ధాశ్రమంలో చేర్పించడం ఏంటండి. మీకేమైనా మతి పోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇవి ఒక కొడుకు మాట్లాడాల్సిన మాటలేనా అత్తయ్యని కూడా మనతో పాటు తీసుకెళ్దాం.

ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య వృద్ధాశ్రమంలోఎలా ఉంటారు. ఆమెతో  మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు, ఎవరైనా వింటే నవ్విపోతారు.అంటూ వాదిస్తున్న నాతో నీకేం తెలీదు గాయత్రి నువ్వు మాట్లాడకు నోరు మూసుకుని లోపలికి పో, 24 గంటలు ఏదో ఒక వంకతో నిన్ను సాధిస్తూ ఉన్నా నీకు బుద్ధి రావడం లేదు.

ఇంకా ఆవిడ్ని వెనకేసుకొస్తున్నావు అంటూ కొప్పడుతున్న గౌతమ్ తో పెద్దావిడ ఏదో అంటారు.
అదే మా అమ్మ అంటే నేను ఓర్చుకోనా చెప్పండి.
అత్తా, కోడలు, ఆడపడుచులు, తోటి కోడళ్ళు
అంటే ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అంతమాత్రాన వదిలేసి పోతామా బంధాలను వదిలించుకోవడం అంత సులభమా, ఆవిడ ఒక మాట అన్నంత మాత్రాన నేను తక్కువ అయిపోను. అయినా మీరు చేసేది అసలు సరి అయిన పని కాదు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు.

మీరే అలా ఆలోచిస్తే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి అంటున్న నాతో మా అత్తయ్య నా తల్లే నా బంగారమే మే,నేను నిన్ను ఎంత హింస పెట్టినా, కావాలని సాధించినా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు.

ఇన్నాళ్ళు నీలాంటి మంచి కోడల్నా నేను ఇబ్బంది పెట్టి బాధ పెట్టింది అంటూ నా  చేతులు పట్టుకుని నన్ను క్షమించమ్మా అంటున్న అత్తగారితో అయ్యో అత్తయ్య మీరు పెద్దవారు అలా మాట్లాడకూడదు. మీరు నాకు అమ్మ లాంటి వారు అంటున్న నాతో ఇక నుంచి నేను నీకు అమ్మనే.మీ అమ్మను మరపిస్తాను గాయత్రి అంటూ సరే గౌతం మీరు వెళ్ళండి.

నేను ఇక్కడ నువ్వు చెప్పిన వృద్ధాశ్రమంలో  క్షేమంగానే ఉంటాను.అని బాధగా చెప్తున్న తల్లితో నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాము అమ్మ. నాన్న లేకపోయినా మమ్మల్ని ఎంతో బాధ్యతగా పెంచావు. ఒక్క నీ కోడలి విషయంలోనే నీ ప్రవర్తన సరిగా లేదు అందుకే అలా అన్నాను.నాకు ప్రమోషన్ వచ్చిన మాట నిజమే
కానీ ఏ ఊరు వెళ్లాల్సిన అవసరం లేదు అమ్మ.

నీలో మార్పు కోసమే అలా మాట్లాడాను.నన్ను క్షమించమ్మా  అంటున్న కొడుకుతో అంత పెద్ద మాటలు ఎందుకు లేరా నాన్న నా  తప్పు నేను తెలుసుకునేలా చేసావు అది చాలు. ఇన్నాళ్ళు నేను చీకట్లో  ఉంటూ అదే వెలుగు అని భ్రమ పడ్డాను

కానీ నువ్వు నన్ను ఆ చీకట్లోంచి బయటికి తీసుకొచ్చి  నా కోడలు జీవితంలో వెలుగునీ సంతోషాన్ని నింపావు. అంటూ నన్ను ఆయన్ను తన అక్కున చేర్చుకుంది మా అత్తమ్మ  ఎంతో ప్రేమగా

“చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని” అంటూ  నిన్న తాను విన్న పాట చెవుల్లో ప్రతిధ్వనిస్తూంటే
ఆనందంగా అత్తగారి చేతుల్లో ఒదిగి పోయాను నేను. ఇక నా జీవితం సంతోషమయమే  అని రాబోయే మధురమైన రోజుల్ని తలుచుకుంటు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!