మాట కు శిస్తు

మాట కు శిస్తు

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

నేను మద్య తరగతి కుటుంబంలోని సాదారణ గృహిణి ని
నా పేరు చైతన్య గణేష్
మా వారు  ఒక ప్రైవేట్ ఆఫీసు లో అసిస్టెంట్ మేనేజర్… ఇద్దరు పిల్లలు
చాలా హాయిగా సాగిపోతున్న జీవితం మాది

పొద్దున్న పాలవాడి పిలుపుతో మంచము మీది నుండి నిద్ర లేచే నేను
రాత్రి మా వారి పిలుపుతో మళ్లీ మంచం మీదకి వెళ్లి నిద్ర పోతాను మద్య లో అసలు కాసేపు కూడా సమయం దొరకదు విశ్రాంతి కి
నేను ఉదయాన్నే ఇంటిపని వంటపని చేసి మా వారికి బాక్స్  ఇచ్చేసి  ఆయన ఆఫీస్ కి వెళ్లాకా  పిల్లల్ని స్కూలుకి పంపించేసి నా పనులు నేను చేసుకుంటాను
ఒకటి మాత్రము నిజం అండి  ఇంట్లో పని ఎప్పుడు అయిపోదు
అయిపోయింది అని బలవంతంగా పులిస్టాప్ పెడతాం   ఏరోజుకారోజు
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని
ఏదో మనం అయిపోయింది అనుకోవడం తప్ప
అది అసలు అయిపోదు
నేను ఇలా నాకు నేను అనుకుంటూ సెలుపులు సర్దుతున్నాను

ఇంతలో మా పక్కింటి వనజాక్షి వచ్చి కూర్చుంది……….. ఆవిడ రోజు వస్తూనే ఉంటుంది నేను సమాదానం చెప్పిన చెప్పక పోయిన ఆవిడ పట్టించుకోదు
ఆవిడ చెప్పాలనుకుంది చెప్తునే  ఉంటుంది

నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను .
ఆమె మాట్లాడుతూ ఉంది ఆమె ముచ్చట్లలో ఎక్కువగా ఉండేది…………

ఫక్కింటి ఆయన ఇలా ……..ఎదురింటాయన అలా  అతను తాగుబోతు అంట కదా ఇతను  తిరుగుబోతు అంట కదా అని ఇలా మాట్లాడుతూనే ఉంటుంది  …..
అందరి గురించి ఏవో ఏవో ………అవి నిజాలో  తెలియదు అబద్ధాలో తెలీదు …….ఏదో చెప్తుంది…. ఆవిడ అలా చెప్తుతునేవుంది నేను బయటికి వచ్చి బట్టలు ఉతకడానికి కూర్చున్న
వనజాక్షి కూడా నా పక్కన స్టూల్ వేసుకుని కూర్చుండి మళ్లీ చెప్తుంది

ఎదురింటి పార్ధు గాడు కనిపించాడు పోన్లో మాట్లాడుతూ
ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు  వాడు  బాగా చదువుతున్నాడని వాళ్ళ అమ్మానాన్న పెంట్ హౌస్
ఖాళీ చేయించి మరి వాడి కి   పోన్  ఇచ్చి చదువుకోమంటే   వాడు  ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటాడు ,

వాడు ఒక్క నిమిషం చదివినప్పుడు నేను చూడలేదు. ఆ ఫోన్లో అంత బాతకానీ ఏం కొడతాడో తెలిదు .
వాడి ని చూస్తూనే బట్టల పని కానిచ్చి కూరగాయల వాడు వస్తే కిందకు వెళ్లాను
వనజాక్షి కూడా నాతో పాటు వచ్చింది కూరలు కొనటానికి

మా కింద..ఇంటి బామ్మ గారు
ఆ బామ్మ గారు ఒక్కరే ఉంటారు …….ఆమె మా ఓనర్ ……ఆమె పొద్దున నుండి రాత్రి వరకు సీరియల్సు చూస్తూ ఉంటారు…

ఒకవేళ పొరపాటున నేను కనిపించానా లేక ఎవరైనా కనిపించినా…..ఆ సిరియల్ లో వాళ్ళ అత్త ఎలా చేసింది ……………….
ఆ సీరియల్ లో హీరో ఇలా చేస్తున్నాడు……….

కార్తీక దీపం ఎప్పుడు అయిపోతుందో……….గృహలక్ష్మి లో నందు అలా చేసాడు  ఎంటో…..

సీరియల్ లో చూపించే  వాళ్ళ పాత్రల గురించి కూలంకషంగా చర్చ………..అన్ని పాత్రల గురించి చర్చిస్తుంది.
అమ్మబాబోయ్ నేను భరించలేను ఆ సీరియల్ గోల అనుకోని
ఎలాగోలా తప్పించు కున్న కూర మాడుతుంది  అని అబద్ధం చెప్పి పైకి వచ్చేసాను
స్నానం చేసి టైలర్ దగ్గరకు వెళ్లాలని గుర్తొచ్చి  రడి అయి బయలుదేరాను
మా కాలనిలోనే  టైలర్ షాప్
మా పాప  స్కూల్ లో పంక్షన్ అట… అందులో మా పాప డ్యాన్స్ చేస్తుంది దానికి లంగాఓణి కావాలంటే కుట్టించడానికి ఇచ్చాను
ఆవిడ ఇవాళ ఇస్తానంది
మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న  అప్పుడు ఒక పిలుపు వినపడింది……..చూస్తే  ఆంటీ గారు
మా కాలని లో రిటైర్డ్ భార్యభర్తలు  వారు
వాళ్లది మా కాలనీలో మొదటి ఇల్లు ………… ఆమె ఎప్పుడు గేట్ దగ్గరె కూర్చుండి వచ్చి పోయే వారు  తెలిసినవారు  వెళ్తుంటే  పిలిచి మరి ..
నేను ఎప్పుడైనా పొరపాటున బయటికెళ్తే కూడా ఆ ఆంటీ గేటు దగ్గరే కూర్చోబెట్టి
కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళు మనవడు గురించి ముచ్చట్లన్నీ చెప్తుంది……….
వారు వీళ్ల దగ్గరకు రారు వీరు అక్కడకి వెళ్లరు….

ఆమె కొద్ది సేపు చెప్పాకా టైం అయిందని
టైలర్ షాప్ మూసేస్తుందని  చెప్పి బయటపడ్డాను

నేను ఒక ఇల్లాలిని కాబట్టి నాకు అసలు టైమ్ ఉండదు
ఉన్న ఏదో ఒకటి చేసుకుంటాను పిల్లలకు చిరుతిళ్లు, కుట్లు అల్లికలు ఇలా
కాని ఆ టైమ్ కాస్త  ఇలా సరిపోతుంది

.ఒక్కటి ఉపయోగకరమైన మాట ఉండదు అన్నీ అనవసరమైన చర్చలు, టైంపాస్ ముచ్చట్లు ,

నాకేమో రోజంతా పని ఉంటుంది ………
.వాళ్లకేమో  ఉండదు….నేను ఏం చేయాలిరా దేవుడా అని రోజు నా మనసులో ఆలోచిస్తుండగా ఒక రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది…………

నా  కలలో వాళ్ల మాటలనే శూలాలతో నన్ను పొడవడానికి వస్తుంటే నేను గట్టిగా అమ్మ  అమ్మ నన్ను వచ్చి కాపాడు దుర్గమ్మ అని అరుస్తూన్నాను….

అప్పుడు దుర్గమ్మ వచ్చింది….వాళ్లతో   దుర్గమ్మ మీకు మాట్లాడడం అనే ఒక వరాన్ని ఇచ్చినందుకు దానిని దుర్వినియోగం చేసుకుంటున్నారు …..
అందువల్ల ఈ రోజు నుండి మీరు మాట్లాడే ప్రతి మాట కు మీరు శిస్తు కట్టాల్సి ఉంటుంది … …….
ఎలాగైతే మీరు విద్యుత్ వాడినప్పుడు
పోన్ కి టివి కి  నెలనెలా శిస్తూ కడతారో అలాగే మీరు మాట్లాడిన ప్రతి మాట కు శిస్తు కట్టాల్సి ఉంటుంది
అని చెప్పి మాయమైంది

ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడమే తగ్గించేశారు
నాక్కూడా  కొంత సమయం దొరికింది విశ్రాంతి కి
వనజాక్షి రావడం లేదు మా యింటికి
కింద బామ్మ గారు సీరియల్ గోల ఆపేసి
ఆమెకు ఎంతో ఇష్టమైన పిండి వంటలు చేసి అమ్ముతున్నారు
పార్థు గాడు కామ్ గా చదువుకుంటున్నాడు
రిటైర్డ్ బార్యభర్తలు మొక్కలు పెంచుతున్నారు
కూరగాయల ను పండిస్తున్నారు వారికి సరిపోగా  మిగిలినవి అందరికి ఇస్తున్నారు…..

దేవత ఇచ్చిన వరం నాకెందుకో బాగా నచ్చింది……

తరవాత నేను మాట్లాడిన వాళ్లు ఎంతో పొదుపుగా మాట్లాడేవాళ్ళు అవసరం ఉన్నంత వరకే మాట్లాడి వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకునే వాళ్ళు….
అందరిలో  ఎంత క్రమశిక్షణ అలవడిందో
చాలా బాగుంది
కాని
కలలోనే  జరిగింది    ఇలలో జరగలేదు……

తెల్లవారి లేచి చూసేసరికి అంతా మామూలుగానే ఉంది …..నిజంగా నాకు వచ్చిన కల నిజమైతే ఎంత బాగుండు అనిపించింది …………..

ఏదైనా దేవుడు ఇచ్చాడు కదా.,అని  మన నాలుకను గొంతును ఎక్కువగా వాడటం కూడా తప్పే కదా……

నిజంగా నాకు వచ్చిన కల నిజం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ………

ఎందుకంటే సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనది,,,,కొంతమందికి 24 గంటలు సరిపోక ఇంకో గంట ఉంటే బాగుండేది అనుకుంటారు .
ఉన్న జీవితాన్ని సద్వినియోగము చేసుకోవాలి కదా
ఊరికే సమయం వృదా చేయడం వల్ల ఏమోస్తుంది
అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది………
నేను మితభాషిని అవటం కూడా ఒక కారణం కావచ్చు ఈ కల నచ్చటానికి.
(అందరికి  ఈ కల నచ్చటానికి లేదు… ఎవరి వాదనలు వారివి……………………….

You May Also Like

2 thoughts on “మాట కు శిస్తు

  1. చాలా బాగుంది సిస్, నోరు అనవసరంగా వాడే వాళ్లను చూస్తే ఇలాగే టాక్స్ పెట్టాలని అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది సిస్😊😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!