సూర్యా శ్రీ  మంజీరా (సంక్రాంతి కథల పోటీ)

సూర్యా శ్రీ  మంజీరా
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం కన్నా ముందు లేచి పొలం పనులకు వెడతాడు నిజానికి కష్టం అంతా  నాన్నదే అని చెప్పాలి. తాతగారు రామారావు గారు, నాన్న వెంకటరావుని చాలా పద్ధతిగా పెంచారు. అగ్రికల్చర్ బీ ఏ సి చదివిన వెంకట్రావ్ మాత్రం తనకున్న నలబై ఎకరాలు వ్యవసాయం చేసే విధానం లో కొత్త పద్దతులు అలవాటు చేసుకుని పంట పండిస్తు సొంత ఊరిలో నాన్న వెనుక ఉండి సలహాలు సంప్రదింపులతో పంట దిగుబడి పెంచి మిల్లుకి ధాన్యం పంపి ఆ డబ్బు తన తమ్ముళ్ళకి ఇద్దరికీ పంచుతాడు. అక్కక్కి నాన్న ఇచ్చిన పొలం తాలుకు సిస్తు బ్యాంక్ లో కడతాడు ఆక్క కూతురు రేఖను అఖరి తమ్ముడు విజ్ఞాన్ కి చేశారు. మళ్లీ ఆ పోలం కూతురికి పసుపు కుంకుమల గా ఇచ్చింది కనుక ఆ పంట తమ్ముడికి ఇవ్వాలి కానీ నాన్న ఇప్పుడు అవసరం లేదు అది ఉన్నంత కాలం అదే వాడుకుంటుంది దాని అనంతరం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తమ్ముడికి ఇవ్వ వచ్చును అని చెప్పాడు. అల్లుడు కాస్త పెద్ద చెయ్యి అందుకని కూతురు డబ్బు కూడా అతనే పుచ్చుకుంటారు.
అని అంతా అన్నా సరే పర్వాలేదు డబ్బు ఉన్నది అవసరానికి వాడు కోవాలి అంటే కానీ పిసిని కొట్టు తనంగా దాచు కోవడనికా అని మండలిస్తారు..
కాలగమనంలో సూర్య కొడుకు డాక్టర్ చదవాలి అన్నారు. సూర్య భార్య మంజరీ మంచి విద్య వంతుల కుటుంబం లోనుంచి వచ్చింది హోమ్ సైన్స్ బీ ఏ సి చదివింది. ఇంటి పనులు వంట పనులు అన్ని చక్కగా చేస్తుంది. అత్తగారు కూడా కూతురిలా చూసుకుంటుంది. పెద్దగా ఏమీ సతాయించదు కోడలితో కలిసి ఉండాలి అన్న స్వభావం ఏదైనా పొరపాట్లు ఉన్నా సర్దుకు పోతారు. అలా మంజరీ ఆ ఇంటి కోడలిగా అల్లుకొని ఉన్నది. పెళ్లికి ముందే చెప్పారు మా పెద్ద అబ్బాయి మాకు ఉన్న అస్తి అంతస్తు అన్ని చూడాలి. వేరే చోటికి ఉద్యోగానికి పంపమని చెప్పారు అందుకు ఇష్ట పడే మంజరీ పెళ్లి చేసుకున్నది. మిగతా అక్కలు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు నువ్వు అలాంటి కోరికలు ఉంటే మా అబ్బయి విదేశాలకు వెళ్ళడు అని ఖచ్చితంగా చెప్పారు. ఒక పిల్ల అయిన ఇండియాలో ఉండాలి అని మంజరీ తండ్రి సూర్యా శ్రీ సంబంధం కుదిర్చి డెబ్బై యోగాల పెళ్లి చేశాడు. అంతా సజావుగానే ఉన్నది అయితే కొడుకుల అస్తి పంచి ఎప్పుడో రాశాడు కానీ సిస్తులన్ని సూర్య చూస్తాడు అతడే పొలం పనులు అన్ని దగ్గర ఉండి చేయిస్తాడు. ఈ ఏడాది కొంచెం డబ్బు రాలేదు ప్రకృతి పరిస్తితి అనుకూలంగా లేవు అన్నందుకు తమ్ముళ్ళకి కొంసెం బాధ అనిపించింది. కానీ సూర్య మాత్రం ఏమి చెయ్యగలడు ఇన్ని ఏళ్ళు లాభం పొందారు ఆ డబ్బు ఉన్నది కదా రైతన్నను అనుకుని లాభం ఏమి ఉన్నది. ఈనాటి పరిస్తితుల్లో పంట నష్టం బాగా జరిగింది డబ్బు సరిగ్గా రాలేదు పంట పోయిందని బాధ మిగిలింది. కానీ ఇంట్లో వ్యక్తి అన్నగారు పొలం చేశాడు ఎవరిని అంటారు. ప్రకృతి మాత అనుగ్రహముతో ఈ పంటలు మనకి ఇంటికి రావాలి ఇది దైవ నిర్ణయం దేశం అంతా పంట నష్టం జరిగింది మనకి ఈ మాత్రం తిండి బట్ట ఉన్నాయి.
బయట మనుష్యులు ఎంత బాధ పడుతున్నారు  అన్నది ఒక సారి ఆలోచిస్తే జీవితంలో ఋతపవనాలు వల్ల రైతు పడే పాట్లు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇవ్వాళ వచ్చినదేదో సరి పెట్టుకోవాలి ఇన్నాళ్లు పంట అధికంగా వచ్చి లాభాలు వచ్చి నప్పుడు ఎవరూ ఏమీ చెప్పలేదు  కానీ నేడు పంట దిగుబడి లేక నష్టం వచ్చింది కనుక అమ్మో పొలాల చాలా కస్టమ్ అన్నారు. అసలు మార్కెట్లో బియ్యం ధర ఎంతో ఉంటుందో కొనాలి అంటే చుక్కలు కనిపిస్తాయి. ఎన్నాళ్ళు ధాన్యం బస్తాలు అడించి ఇంట్లో గాదె లో పెట్టేనిల్వ చేసేవారు. ఏడాది ధాన్య నిలువ కూడదు ఆ ధాన్యం నిలువ ఉండవు అని అన్నారు నిజమే తడిసిన ధాన్యం నిలువ ఉండదు నిలవ ఉంచ కూడదు కూడా అన్నారు. ఏడాదే పిల్లడి చదువు వచ్చింది. నేటి కాలంలో మెరిట్ లో రావడం చాలా గొప్ప విషయం ఓసి కోటలోనే సిటు వచ్చింది. పిల్లాడు చదువు అయితే సరి అనుకున్నారు. విదేశాల్లో ఉన్న తన అక్క పిల్లలు డాక్టర్స్ ఇంజినీర్స్ చదివారు అక్కలు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లాడిని అక్కడికి పంపించే య్యామన్నారు. కానీ మంజరీ ఆలోచించింది ఒక్క గాని నొక్క కొడుకు వాడిని విదేశాలకు పంపి ఇక్కడ నుంచి రోజు ఫోన్ కాల్ కొసమేదురు చూడట మెందుకు అని ఆలోచించారు ఇండియాలోనే చదువు చెప్పిన స్తోమత తమకు ఉన్నది ఎందుకు పిల్లాడిని దూరం చేసుకోవడం అని అలోచించి వద్దులే అక్క ఇక్కడ చదువు అవ్వాలి మా మామ గారు పిల్లాడిని వదిలి ఉండలేరు అన్నది. ఆడపిల్ల డిగ్రీ చదువుతోంది ఇంకా ఒక్క ఏడాదిలో అయిపోతుంది అప్పుడు దాని పెళ్లి చెయ్యాలి మామ గారు ఏమంటారో అని ఆలోచించింది.మంజరీ పిల్లల కోసం ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో ఉంటుంది. ఎందుకంటే తన అక్కల పిల్లలతో పోలుచుకుంటు ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి వంటి ఆలోచనలు కుటుంబం గురించి స్త్రీ కే ఎక్కువ ఉంటుంది.  అత్తమమాలను తను ఎంతో గౌరవంగా చూసింది దేవుడు అందుకే తమను బాగా చూస్తాడు అని అనుకుంటుంది. ఎంతో తృప్తి పడుతుంది.
జీవితంలో పెద్దలు అందరికీ ఉండరు ఉన్న వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే దృక్పథంతో తను సూర్య శ్రీ నీ పెళ్లి చేసుకున్నధి పెద్దలు మంద లించక పోతే ఇంకెవ్వరూ మందలిస్తారు అని సరిపెట్టు కొనేది. ఇప్పుడు ఈ పంటల సమస్యలలో ఆలోచించి కొడుకు చదువుకి తను దాచిన డబ్బు కట్ట వచ్చని చెప్పింది. అయ్యో మనకి అంతా సమస్యలు  లేవు  ఊరికే సమాజ అంశాల గురించి ఇలా చెపుతున్నాను. ఇన్నేళ్ల పంటలు వచ్చిన వాటికి సంతోషించాలి ఈ ఒక్క ఏడు పంటల కోసం అన్ని ఉన్న మనమే ఇలా అనుకుంటే సామాన్యులు ఏమి అవ్వాలి చెప్పు అన్నారు. ఈ లోపుల పెద్ద నాన్న ఫ్రెండ్ కొడుకు ఫ్యామిలితో  హైదరాబాద్ నుంచి వచ్చేశారు. అక్కడ పదిహేనేళ్ల  నుంచి స్థిరపడి ఉన్నారు కొడుకు లిద్దరూ సాఫ్టు వేర్ ఇంజినీర్లు అల్లుడు సాఫ్టు వేర్ ఇంజినీర్. అంతా కూడా వాళ్ళ నాన్న గారి శతదినోత్సవం సందర్భంగా వచ్చారు ఆ ఊళ్ళో వాళ్ళు వీళ్ళే పెద్ద ఆస్తి పరులు అయినా సరే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అంతా ఇంటిలోనే ఉన్నారు. పనిమనిషి వంట మనిషి అన్ని కూడా ఈ గడ్డు రోజుల్లో సమస్య గా ఉన్నది బయటి నుంచి పని వాళ్ళని తెచ్చుకుని పని చేయించు కోవాలి అంటే ఎన్నో సమస్యలు ఇలా ఆలోచించి అక్కడ ఇల్లు అక్కడే ఉంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడి సామాను ఇక్కడ ఉన్నది వెంటనే ఇంట్లో కావాల్సిన ఆధునిక హంగులు ఇంటర్నెట్, గోడ టీవీ ఇత్యా దివి పెట్టించుకుని వంట మనిషిని పెట్టుకుని ఉండి పోవడానికి వచ్చాము అన్నారు. రామ రావు గారికి మంచి కాలక్షేపం రోజు ఒక గంట సాయంత్రం ఇద్దరు కలిసి దేవాలయానికి  లేక చెరువు గట్టుకు వెళ్లి కుర్చీని జీవిత విషయాలు విశేషాలు మాట్లాడు కునేవారు. నీ పిల్లలు చక్కగా ఆలోచించారు సరి అయిన సమయంలో ఉన్న ఊరు వచ్చారు అని సంతోషం చూపారు. నువ్వు మొదటి నుంచి సూర్యని ఇక్కడే పెట్టుకున్నావు మేము కొన్నాళ్ళు సిటీ జీవితం చూసాము ఇప్పుడు వెనక్కి వచ్చాము.
భూమి గుండ్రంగా ఉన్నదనే సత్యాన్ని నీరు పించాను అన్నాడు రామారావు ఫ్రెండ్ సర్వేశ్వర రావు. మా మనవడిని డాక్టర్ చదివించాలని సంకల్పంతో అంతా ఉన్నారు వాడికి మార్కులు బాగానే వచ్చాయి కానీ విదేశాల్లో చదివించాలని కోడలు పట్టు పడుతోంది అన్నాడు. సరే నీకేమి లోటూ అస్తిపరుడువి చదివించి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టమని చెప్పు అన్నాడు. మనుమలు వింటారా చెప్పు ఎదో ఆ నాడు నా సూర్య విన్నాడు కోడలు కలిసి వచ్చింది కానీ ఈ తరం పిల్లలకి అల కుదరదు అన్నాడు.
మా చిన్న అబ్బాయి పెళ్లి చెయ్యాలి అని సర్వేశ్వర రావు అన్నాడు మరి ఇంకేమీ మంచి సంబంధం ఉంటే చెప్పు అన్నాడు మనం విధిని నమ్ముతాము. ఎవరికి ఎవరు రాస్తే వారే అవుతారు అన్నాడు.
ఊళ్ళో ఏదైనా చూస్తావా అన్నాడు ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అంతా కూడా ఆడ మగ అదే ఉద్యోగం మరి పిల్ల డిగ్రీ చదివితే చాలు నాకున్నది వాడికి సరి పోతుంది. మా ఆస్తి కన్నా నిదీ కొంచెం ఎక్కువే అంతే కాదు హైదరాబాద్ లో ద్రాక్ష తోటలు కూడా కొన్నాము అవి రెండవ వాడికి ఇచ్చాను ఉత్తా రోత్ర ఎవరూ ఎక్కడ ఉన్నా ఉద్యోగాలు చేసినా చెయ్యక పోయినా అన్నోదకాలు కి లోటూ ఉండదు  రెండు చోట్ల పక్కా ఇళ్లు ఉన్నాయి అక్కడ రెండు ఇల్లు లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి వాళ్ళ ఇష్టమే అన్నాడు  మా ఆవిడ చలికి అక్కడ ఉండ లేక పోతోంది అందుకని పిల్లలు కూడా వచ్చేశారు కోడలు నేమ్మ దాస్తురాలు. చెప్పి నట్లు వింటుంది పిల్లలని బాగా పెంచుకుంటుంది. మేము చెప్పినట్లు వింటుంది అన్నాడు వంట వార్పు కి మనుష్యులు ఉన్నారు ఆడ వాళ్ళు కలిసి ఉంటారు. మాఆవిడ కోడల్ని బాగా చూస్తుంది అన్నాడు. మనుమడు చదువుకి తాత రామారావుగారి కావాల్సిన డబ్బు తన వంతు వాటలో చవించడానికి నిర్ణయించారు. ఇదే విధంగా పిల్ల పెళ్లి కూడా మమ్మ డబ్బుతో చెయ్యాలని నిర్ణఇంచరు కారణం ఈ ఆధునిక రోజుల్లో కోడలు తమ ఇంట నిలబడి చదువు సంధ్య అన్ని మరచి అత్త ఇంటికి అంకిత మయ్యింది.
పిల్లలని కూడా బాగానే చదివించి కున్నది సూర్య శ్రీ ఎక్కువ భాగం పొలం పనులతో సరి పోయేది. అసలు నిలబడు తుంద డాక్టర్ కూతురు అని పెళ్ళిలో చాలా మంది వ్యక్త పరిచారు కానీ అనే వాళ్ళ మాటలకు నవ్వు చుద్దురు గాని అనేది. మిగిలిన ఇద్దరు కొడుకులు సిస్తులు లెక్క పెట్టడమే కానీ ఏనాడు ఇంటి భాద్యతలు పట్టించుకో లేదు. ఎప్పుడు వచ్చి పట్టుమని పదిహేను రోజులు ఉండేవారు కాదు వాళ్ళకి ఇక్కడి భోజనాలు వాతావరణం కూడా కుదరదు అంటారు ఏమి చెయ్య గలరు లోకో భిన్న రుచి అన్నారు సతీష్ తాత గారి డబ్బుతో డాక్టర్ చదివాడు. కాల గమనంలో యిట్టే గడచి పోయింది. సొంత ఊరిలోనే ప్రాక్టీస్ పెట్టాడు ప్రతి ఆదివారం లేనివారికి ఉచిత వైద్యం చేసే వాడు అలా ఆ ఇంటి పరువు ప్రతిష్టా మనుమడు తండ్రి తాత పేరు నిలబెట్టాడు మనుమారాలు సృజనను ప్రక్క ఊరి డాక్టర్ కొడుక్కి చేశాడు వాళ్ళు సుఖంగానే ఉన్నారు సర్వేశ్వర రావు వాళ్ళ మను మ రాలి నీ సతీష్ కి చెప్పారు అంతా కన్నా నా అన్నారు. ఆ అమ్మాయి ఇంజినీర్ చదివింది అయిన సరే ప్లాన్స్ అవి ఇంటి దగ్గరే వేస్తూ ఉంటుంది స్వయం కృషి స్వయం ఉపాధి మనిషికి అవసరం ఎక్కడో కంపెనీ లలలో చేసే కన్నా ఇంటి పట్టున ఉండి పొలాలు చూసు కుంటు ఒక్క ఎకరం కూడా అమ్మకుండా చక్కగా కుటుంబాలు నడుపుతున్నారు.
మన ఆలోచనలో ఎన్నో సుఖాలు సంతోషాలు ఉన్నాయి. ఈ వాళ ప్రపంచం అరచేతి కుగ్రామం అయ్యింది విదేశీ పరుగు అనవసరము ఉన్న దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసుకోవాలి జై కిసాన్ అన్న నినాదానికి అర్ధం చెప్పారు ఇద్దరు స్నేహితులు కూడా పొరుగూరు నుంచి సంగీతం మాస్టారు వస్తున్నారు. ఆయన చేత పిల్లలకి మనుమలు సంగీతం నేర్చుకుంటే మంచిది అన్నారు. అన్న తడువుగానే వారి పాత ఇల్లు రిపేర్ చేయించి అక్కడే ఉండేలా ఆ ఊరు పిల్లలకి సంగీతం నేర్పెలా ఏర్పాటు చేశారు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో ఇందరికి అభయంబు లిచ్చు చెయ్యి అన్నట్లు గా ఆ ఊరికి భగవంతుని దయ వల్ల అన్ని ఏర్పాట్లు చేసి ఉత్తమ పంచాయితీ గా ప్రభుత్వ అవార్డ్ కూడా పొందారు. రామయ్య గారిని సూర్యశ్రీ నీ మినిస్టర్ గారు కలెక్టర్ గారు ఎంతో మెచ్చుకున్నారు ఇంకేమీ ఆ ఊళ్ళో డాక్టర్ ఇంజినీర్ సంగీతం మాస్టారు లైబ్రరీ అన్ని కూడా వచ్చాయి. అంతా  ఎంతో సంతోషించారు.

 “సర్వే జనా సుఖినభవంతు”

You May Also Like

One thought on “సూర్యా శ్రీ  మంజీరా (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!